E-Paper
Advertisement

Madhapur drugs case: డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

Madhapur drugs case: డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..
Advertisement
Madhapur drugs case updates

Madhapur drugs case updates(Telangana news live) :

సంచలన రేపుతున్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్షియర్‌ వెంకట రత్నాకర్‌రెడ్డి విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు వెంకట్ తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతడిపై 25కుపైగా కేసులు ఉన్నాయని తేలింది.

వెంకట రత్నాకర్‌రెడ్డి తాను ఐఆర్ఎస్ అధికారినంటూ చెప్పుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు సినీ నిర్మాతల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. అలాగే ఓ అధికారిని మ్యారేజ్ పేరుతో మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు వెంకట రత్నాకర్ రెడ్డి వల వేస్తున్నాడని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. వెంకట రత్నాకర్ రెడ్డి హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలను నిర్వహిస్తున్నాడని యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసుల విచారణలో తేల్చారు.

వెంకట రత్నాకర్‌రెడ్డి మొబైల్‌ను పోలీసులు పరిశీలించారు. అతడితో పరిచయం ఉన్నవారిని ప్రశ్నించాలని భావిస్తున్నారు. నైజీరియన్లతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వెంకట రత్నాకర్ రెడ్డి నిర్వహించే డ్రగ్స్‌ పార్టీలకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, గంజాయితోపాటు ఇంకా ఏ డ్రగ్స్‌ను పార్టీల్లో ఉపయోగించారన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×