E-Paper
Advertisement

Assembly Security: మంత్రిని, ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ పై సర్కార్ సీరియస్..!

Assembly Security: మంత్రిని, ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ పై సర్కార్ సీరియస్..!
Advertisement

Assembly Security: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహాతో పాటు డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై సర్కార్ ఆరా తీస్తున్నది. అడ్డుకున్నది ఎవరు? అనే దానిపై మంగళవారం ఉన్నతాధికారులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఓ సీనియర్ మంత్రిని అడ్డుకోవడానికి గల కారణాలు తెలపాలని ఉన్నతాధికారులు ఆయా స్టాఫ్​ ను కోరనున్నారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం పేషీ వద్ద కూడా ఎమ్మెల్యేలను అడ్డుకున్న స్టాఫ్​ పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. పూర్తి స్థాయి వివరాలు సేకరించి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని రోజుల నుంచి మంత్రుల సెక్యూరిటీ టీమ్, గన్ మెన్లపై వరుసగా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీలో జరిగిన సంఘటన చర్చంశనీయంగా మారింది.

Also Read: Lokesh kanakaraj : ఏంటి గురు ఇది.. సినిమాల్లోకి రాకముందు ఆ పని చేశావా..?

డిప్యూటీ సీఎం దగ్గర మూడు సార్లు ఛేంజ్..

Advertisement

డిప్యూటీ సీఎం వద్ద ఉన్న సెక్యూరిటీ టీమ్ ను ఇప్పటి వరకు మూడు సార్లు మార్చినట్లు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర మంత్రులెవ్వరి దగ్గర మారలేదు. కానీ డిప్యూటీ సీఎం స్టాఫ్​ లోనే మార్పులు సంభవించాయి. పబ్లిక్ నుంచి , ఎమ్మెల్యేల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రజలను కలవనీయకుండా కొందరు సెక్యూరిటీ టీమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇటు డిప్యూటీ సీఎం కూ చెడ్డ పేరు వస్తున్నది. సచివాలయంలో సెకండ్ ప్లోర్ లో పెట్టిన ఆంక్షలు వలన డిప్యూటీ సీఎం ను కలిసేందుకు వస్తున్న ప్రజలు, లీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ మంత్రి దగ్గరా లేని రూల్స్ ఈ ప్లోర్ లో అమలు పరుస్తున్నారు. సొంత నియోజకవర్గం మధిర పబ్లిక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ టీమ్, స్టాఫ్​ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంతో డిప్యూటీ సీఎంకు నష్టం జరిగే ఛాన్స్ ఉన్నదని స్వయంగా ఆఫీసర్లే వాపోతున్నారు.

Also Read: Sridhar Babu: నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు: మంత్రి శ్రీధర్ బాబు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×