E-Paper
Advertisement

Satyam Scam: సత్యం స్కామ్‌లో జన్వాడ సెగ.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు

Satyam Scam: సత్యం స్కామ్‌లో జన్వాడ సెగ.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
Advertisement

Satyam Scam: దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు జన్వాడ భూముల రూపంలో మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ శివారులోని జన్వాడలో సుమారు ₹5,000 కోట్ల విలువైన భూముల అక్రమ బదలాయింపుపై ఈడీ (అమలు డైరెక్టరేట్) ప్రత్యేక కోర్టులో విచారణ కీలక మలుపు తిరిగింది.

ఈ స్కామ్‌లో ఏం జరిగిందో తనకు తెలుసని, సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు అనుమతించాలని అభినవ్ అల్లాడి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ భూ బదలాయింపులకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పిస్తానని ఆయన కోర్టుకు వెల్లడించారు.

Advertisement

జన్వాడ ల్యాండ్ కేసులో సత్యం రామలింగరాజు, ఆయన భార్య నందిని రాజు, కుమారుడు తేజ రాజుతో పాటు మొత్తం 213 మందికి ఈడీ స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

గతంలో సిబిఐ (CBI) సత్యం స్కామ్‌పై విచారణ జరిపినప్పటికీ, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వందల ఎకరాల భూముల వ్యవహారం అప్పట్లో బయటకు రాలేదు. 2014లో మనీలాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసిన తర్వాతే ఈ లింకులు బయటపడ్డాయి.

Advertisement

జన్వాడ పరిధిలోని సుమారు 97 ఎకరాల భూమికి సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమ బదలాయింపులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

న్యాయవాది రామారావు ఇమ్మనేని కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తదుపరి విచారణను ఈడీ స్పెషల్ కోర్టు జనవరి 27వ తేదీకి వాయిదా వేసింది.

సత్యం కంప్యూటర్ స్కామ్..

భారతదేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమైన సత్యం కంప్యూటర్ స్కామ్, 2009లో రామలింగరాజు నేరాంగీకారంతో వెలుగులోకి వచ్చింది. సుమారు ₹7,000 కోట్ల ఈ మోసంలో నకిలీ బ్యాంకు నిల్వలు, 13,000 మంది నకిలీ ఉద్యోగుల పేర్లతో నిధుల మళ్లింపు జరిగాయి. కంపెనీ లాభాలను తప్పుడు లెక్కలతో పెంచి చూపి, ఆ నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు (మయటాస్) తరలించారు. దీనివల్ల రామలింగరాజుకు 7 ఏళ్ల జైలు శిక్ష పడగా, సత్యం కంపెనీ ‘టెక్ మహీంద్రా’లో విలీనమైంది. తాజాగా, ఈ స్కామ్ ద్వారా సంపాదించిన నల్లధనాన్ని జన్వాడ భూముల కొనుగోలుకు వాడారనే ఆరోపణలపై ఈడీ (ED) విచారణ జరుపుతోంది. దీనిపై తాజాగా రాజు కుటుంబంతో పాటు 213 మందికి నోటీసులు జారీ అయ్యాయి.

Read Also: BRS : ఫిరాయింపు ఎమ్మెల్యే కమ్ బ్యాక్.. బీఆర్ఎస్ డోర్లు తెరచుకునేనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×