E-Paper
Advertisement

Maruti FRONX vs Tata Punch: మారుతి ఫ్రాంక్స్ Vs టాటా పంచ్.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Maruti FRONX vs Tata Punch: మారుతి ఫ్రాంక్స్ Vs టాటా పంచ్.. వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

మారుతి సుజుకి, టాటా కార్ల మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు బ్రాండ్ల నుంచి సామాన్యులకు అందుబాటు ధరలో ఉన్న కార్ల నుంచి, లగ్జరీ కార్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ మార్కెట్ లో పోటీ పడుతున్నాయి. ఈ రెండు కార్లు కాస్త అటు ఇటుగా ఒకే ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ రెండూ పాపులర్‌ క్రాస్‌ ఓవర్లు గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఫ్రాంక్స్ మెరుగైన పర్ఫార్మెన్స్, మైలేజ్ అందిస్తే, పంచ్ ఎక్కువ సేఫ్టీ..  5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉంది.  ఎక్కువ బూట్ స్పేస్, తక్కువ ధరతో వస్తుంది, అయితే, పంచ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీలో బలంగా ఉంటుంది, ఫ్రాంక్స్ హైవేలపై మరింత స్మూత్‌గా ప్రయాణిస్తుంది. ఇప్పుడు మనం రెండు మోడళ్ల ధర, పరిమాణం, బూట్ స్పేస్, సర్వీస్, మైలేజ్, ఫీచర్లు, కలర్స్ సహా ఇతర స్పెసిఫికేషన్లను పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం..

⦿ మారుతి ఫ్రాంక్స్

మారుతి ఫ్రాంక్స్ మంచి ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా 1.0L టర్బో ఇంజిన్, మెరుగైన మైలేజ్, హైవే స్టెబిలిటీ తో వస్తుంది. పెట్రోల్ టాప్ మోడల్ లో 1197 సిసి ఇంజిన్ సామర్థ్యం ఉంటుంది. మైలేజ్ విషయానికొస్తే, ఫ్రాంక్స్ లీటర్ పెట్రోల్ కు 28.51 కిలో మీటర్లు ఇస్తుంది. ధర విషయానికి వస్తే రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా పంచ్ తో పోల్చితే ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. తక్కువ బూట్ స్పేస్, తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది. ఇది కేవలం 1-స్టార్ రేటింగ్ ను కలిగి ఉంటుంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం, పర్ఫార్మెన్స్,  ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కోరుకునే వారికి ఇది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.

⦿ టాటా పంచ్

Advertisement

మారుతి ఫ్రాక్స్ తో పోల్చితే ఈ కారు అద్భుతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉంటుంది. 366 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.  మంచి గ్రౌండ్ క్లియరెన్స్, తక్కువ ప్రారంభ ధర, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఫ్రాంక్స్ టర్బో ఇంజిన్ తో పోలిస్తే పర్ఫార్మెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. టాటా పంచ్ ధర రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.  భద్రత, ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్పేస్,  బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కావాలనుకునే వారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

రెండు కార్ల మధ్య తేడాలు  

టాటా పంచ్  ప్రారంభ ధర ఫ్రాంక్స్ కంటే  కంటే తక్కువగా ఉంటుంది. పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉండగా, ఫ్రాంక్స్ కేవలం 1-స్టార్ రేటింగ్ ను కలిగి ఉంటుంది. బూట్ స్పేస్ పంచ్ లో ఎక్కువ (366L) కాగా, ఫ్రాంక్స్ లో తక్కువ (308L). ఫ్రాంక్స్ స్మూత్, పంచ్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×