E-Paper
Advertisement

Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు

Sangareddy District: వెలుగులోకి.. SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు
Advertisement

Sangareddy District: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని SRC ల్యాబొరేటరీ యాజమాన్యం అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేలా ఏర్పాటు చేసిన మెడికల్ డివైస్ పార్కులో.. SRC ల్యాబొరేటరీ కంపెనీ యథేచ్ఛ గా రసాయనాలను పెద్ద మొత్తంలో డంపింగ్ చేస్తూ పారబోస్తోంది. రసాయనాల వ్యర్థాలతో, దుర్వాసనతో కాలుష్యాన్ని దె బ్బతీస్తున్నారు. తనిఖీలు చేపట్టాల్సి‌న పీసీబీ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో తూగుతున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్క్‌లోని.. SRC ల్యాబొరేటరీ కంపెనీ ఆవరణలో రసాయన డ్రమ్ములు నిల్వ చేస్తున్నారు. 2023లో టీజీఐఐసీ ఈ పరిశ్రమకు రెండెకరాల ల్యాండ్‌ను అలాట్ చేశారు. ఈ పరిశ్రమలో.. గ్లౌజ్, డిస్పోజల్ సిరంజిలు, మాస్క్‌లు తయారు చేస్తామని అనుమతులు పొందారు. అయితే ఇప్పటివరకు పరిశ్రమలో రేకుల షెడ్లు, ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టినా ఎలాంటి వైద్య పరికరాలను ప్రొడక్షన్ చేయకుండా కర్ణాటక లోని రాయిచూర్ పారిశ్రామిక వాడ SRC పరిశ్రమ యూనిట్-1 నుంచి వ్యర్ధ రసాయనాలను తీసుకొచ్చి సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్క్‌లో పారబోస్తున్నారు.

Advertisement

అక్రమంగా రసాయనాల నిల్వలతో పర్యావరణాన్ని విధ్వంసం చేసే కార్యకలాపాలు చేస్తున్నారు. వైద్య పరికరాల ఉత్పా దక పరిశ్రమ పేరుతో అనుమతులు పొంది, రసాయన డంపులను యాజమాన్యం నిల్వ చేస్తోంది. పరిశ్రమ ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాల పారబోత, ప్లాస్టిక్ కవర్ల కాల్చివేతలు చేపట్టారు.

స్థానికుల ఫిర్యాదుతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు తనిఖీలు చేసి సాంపుల్స్‌ను సేకరించారు. సదరు పరిశ్రమ వివరాలను టిజిఐఐసి అధికారులను అడగగా సమాచారం దాటవేస్తున్నారు. పీసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లగా కంపెనీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తూ కంపెనీ పరిధిలో ఎవరూ ఉండొద్దంటూ.. కంపెనీలోకి రావొద్దంటూ గేట్ వేసుకున్నారు.

Advertisement

పీసీబీ అధికారులు తనిఖీల అనంతరం హుటాహుటినా కంపెనీ యాజమాన్యం పారబోసిన రసాయనాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద గుంతల్లో రసాయనాలను పూడ్చడంతో పక్కనే ఉన్న దయారా చెరువులో కలిసే అవకాశం ఉందని.. దీంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని  స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ALSO READ: fake rs 500 Notes: నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 417 నోట్లు

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×