E-Paper
Advertisement

OTT Movie : ప్రియుడితో కలిసి అత్త హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… అస్సలు ఊహించలేరు భయ్యా

OTT Movie : ప్రియుడితో కలిసి అత్త హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… అస్సలు ఊహించలేరు భయ్యా
Advertisement

OTT Movie : ఓటీటీలో ఎన్నో జానర్లలో సినిమాలు అందుబాటులో ఉన్నా క్రైమ్ థ్రిల్లర్ లకు ఉండే క్రేజ్ వేరు. మీకు కూడా ఇలాంటి సినిమాలంటే ఇష్టం ఉంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ప్రారంభంలో నెమ్మదిగా ఉండే కథ అకస్మాత్తుగా భయం, ఉత్కంఠ, ప్రతీకార టర్న్స్ తో మంచి థ్రిల్ ఇస్తుంది. చివరి వరకు ఊహించని మలుపుతో కట్టిపడేసే ఈ మూవీలో కోడలు తన ప్రియుడితో కలిసి తన అత్తని హత్య చేస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సరికొత్త కథనం, ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కోసం చూసే వాళ్ళకి “ఉడాల్” (Udal) పర్ఫెక్ట్ ఛాయిస్. రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022లో విడుదలైన మలయాళీ డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా కుటుంబ సంబంధాలు, పక్క చూపుల పరిణామాల నేపథ్యంలో అల్లుకున్న ఒక రాత్రి కథ. ఇందులో ఇంద్రన్స్, ధ్యాన్ శ్రీనివాసన్, దుర్గా కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : నదిలో తేలే శవాలు… జంతుబలితో శాంతి పూజలు… కన్నడ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్

కథలోకి వెళ్తే…

ఈ సినిమా స్టోరీ మొత్తం ఒకే ఇంట్లో నడుస్తుంది. అనారోగ్యంతో మంచానపడిన అత్తగారిని చూసుకుంటూ కాలం గడుపుతుంది కోడలు. భర్త ఉద్యోగం కోసం పెళ్ళానికి, ఊరికి దూరంగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి వచ్చే భర్త దగ్గర లేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంది భార్య. అలా అందరూ భార్యాభర్తలు ఉన్నట్టుగా తాము లేమనే తీవ్ర నిరాశలో ఉన్న షైనీ లైఫ్ మరో మగాడి ఎంట్రీతో ఊహించని మలుపు తీసుకుంటుంది. తన పాత స్నేహితుడు కిరణ్ తో రిలేషన్ స్టార్ట్ చేస్తుంది. ఓరోజు రాత్రి కిరణ్‌ను ఇంటికి పిలవడంతో అక్కడ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Advertisement

కోడలు ప్రియుడితో సన్నిహితంగా ఉండడాన్ని అత్త చూస్తుంది. దీంతో ప్రియుడితో కలిసి అత్తను చంపేస్తుంది కోడలు. కానీ స్టోరీ అంతా రెండవ అర్ధభాగంలో ప్రారంభమవుతుంది. చూడలేని, వినలేని షైనీ మామ తన కోడలిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అతను తన ప్రతీకారం తీర్చుకునే విధానం సినిమాను మరింత ఉత్కంఠభరితంగా చేస్తుంది. ఇంతకీ షైనీ మామ అసలు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? షైనీ, ఆమె ప్రియుడు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారా లేదా ? అనేది కథ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×