E-Paper
Advertisement

Rammohan Reddy: ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి చేతిలో బీజేపీ రిమోట్ కంట్రోల్: సామ రామ్మోహన్ రెడ్డి

Rammohan Reddy: ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి చేతిలో బీజేపీ రిమోట్ కంట్రోల్: సామ రామ్మోహన్ రెడ్డి
Advertisement

Rammohan Reddy: రాష్ట్ర బీజేపీ వ్యవహారాలపై కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రిమోట్ కంట్రోల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేగింది. సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ కీలు బొమ్మల్లా మారిపోయారు. పార్టీ నిర్ణయాలు, వ్యూహాలు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్ర నాయకుడి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఈ పరిణామం బీజేపీ స్వతంత్రతను దెబ్బతీసిందనటంలో సందేహం లేదన్నారు.

బీజేపీ నాయకత్వంపై సామ రామ్మోహన్ రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కార్యక్రమాలను పార్టీలో కొంతమంది నేతలు, కేటీఆర్ కార్యక్రమాల కంటే ఎక్కువగా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు. ఇది బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.

Advertisement

ప్రస్తుత రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకత్వం ఈటల రాజేందర్, హరీష్ రావు సంయుక్త వ్యూహంలో చిక్కుకుందని సామ రామ్మోహన్ ఆరోపించారు. ఈ కుట్ర కారణంగానే.. బీజేపీ అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపడంలో పార్టీ నిస్సత్తువగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాలని చెప్పారు. లేదంటే.. ప్రజలలో పార్టీ విశ్వసనీయత కోల్పోతుంది అని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

ALSO READ: Mahesh Kumar: పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే మంచిది.. మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×