E-Paper
Advertisement

Revanth Reddy: కేటీఆర్ చెంపలు వాయించండి.. ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేయండి.. రేవంత్ సంచలనం..

Revanth Reddy: కేటీఆర్ చెంపలు వాయించండి.. ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేయండి.. రేవంత్ సంచలనం..
Advertisement

Revanth Reddy press meet live(Political news today telangana): టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డోస్ పెంచారు. కాంగ్రెస్ శ్రేణులకు సంచలన పిలుపు ఇచ్చారు. నిరూపయోగంగా మార్చిన రైతు వేదికలకు తాళం వేయాలని అన్నారు. రైతు వేదికల దగ్గర నిరసనకు వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చెట్లకు కట్టేయమంటూ కేడర్‌కు మెసేజ్ పంపించారు. కేటీఆర్ వస్తే.. ఆయన చెంపలు వాయించండంటూ కలకలం రేపారు రేవంత్‌రెడ్డి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు పంచేవరకూ.. చెట్లకు కట్టేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను విడిచిపెట్టొద్దని అన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వట్లేదని నిరూపించేందుకు రెడీ అని.. ఎక్కడ చర్చకు రావాలో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ చేశారు రేవంత్‌రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్ల, చింతమడక.. ఎనీ సెంటర్ తాను రెడీ అన్నారు. విద్యుత్‌ కొనుగోలు కోసం ఏడాదికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నారని.. కానీ, అందులో రూ.8వేల కోట్లు కేసీఆరే దోచుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోళ్లలోనూ కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని.. కొత్త ధర్మల్ పవర్ ప్లాంట్ల టెండర్లలోనూ గోల్‌మాల్ చేశారని విమర్శించారు. అంచనాలు పెంచేసి, నిబంధనలకు తుంగలో తొక్కి.. 30 శాతం కమిషన్లు తీసుకొని.. విద్యుత్ పేరుతో భారీ దోపిడీ చేశారని మండిపడ్డారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాగ్‌బుక్స్ బయటకు తీశాక.. రాష్ట్రంలోని అన్ని సబ్‌స్టేషన్లలోని లాగ్‌బుక్స్ సీజ్ చేసి.. వెనక్కి రప్పించుకున్నారని ఫైర్ అయ్యారు రేవంత్‌రెడ్డి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×