E-Paper
Advertisement

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసిన మణుగూరు కాంగ్రెస్ శ్రేణులు
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో:  సిఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మణుగూరు లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మరో 20 ఏళ్ళుఆయన  ప్రస్థానం ఘనంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

జెడ్పీటీసీ నుండి సీఎం వరకు..

Advertisement

మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపు నిచ్చారు.  2006లో జెడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి   ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా విజయవంతంగా పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగి తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద మరియు బలహీన వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.  ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సిద్ధాంతాలు..

Advertisement

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా నిచేస్తోందని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ముందుండాలని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రజల ఆశీస్సులతో  ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయాలతో కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు.

Also Read: హామీలు ఏమాయె? రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలు!

మణుగూరు కాంగ్రెస్ నేతలు

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దొబ్బల వెంకటప్పయ్య, జిల్లా కమిటీ సభ్యులు శివ సైదులు, బనోత్ లక్ష్మణ్, మైనారిటీ అధ్యక్షులు రహీం పాషా, జిల్లా ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల ముఖ్య నాయకులు, మహిళా అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు  పాల్గొన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×