E-Paper
Advertisement

Group2 : గ్రూప్-2 ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ .. పరీక్షలు ఎప్పుడంటే..?

Group2 : గ్రూప్-2 ఎగ్జామ్స్  రీ షెడ్యూల్ .. పరీక్షలు ఎప్పుడంటే..?
Advertisement

Group2 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించింది. నవంబర్ కు ఎగ్జామ్స్ వాయిదా వేయాలని శనివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పరీక్షల రీషెడ్యూల్‌ చేసిన తేదీలను వెల్లడించింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో గ్రూప్‌ -2 ఎగ్జామ్స్ నిర్వహిస్తామని పేర్కొంది.

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్‌-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌- 2 పరీక్షలు జరగాలి.

Advertisement

ఆగస్టు నెలలో గురుకుల టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, స్టాఫ్‌నర్స్‌, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ లాంటి పోటీ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌- 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. నిరసన బాట పట్టారు. ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. గ్రూప్-2 అభ్యర్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేసింది.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో సమావేశమయ్యారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. తాజా పరిస్థితులను సీఎం కేసీఆర్ కు నివేదించారు. సీఎం ఆదేశాలతో పరీక్షలను నవంబర్ కు ప్రభుత్వం వాయిదా వేశారు. తాజాగా కొత్త తేదీలను ఖరారు చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×