E-Paper
Advertisement

బొగ్గు స్కామ్ దాచేందుకే.. కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం.. సీఎంపై రామంచర్ రావు ఫైర్

బొగ్గు స్కామ్ దాచేందుకే.. కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం.. సీఎంపై రామంచర్ రావు ఫైర్
Advertisement

Ramchander Rao: సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని దాచిపెట్టడంతో పాటు ఈ అవినీతిపై నిజాలు బయటకు రాకుండా అణిచివేయడానికే సీఎం రేవంత్.. కిషన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. పారిశ్రామికవేత్త ఫణి కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నాంపల్లి బీజేపీ ఆఫీసులో రామచందర్ రావు మాట్లాడారు. సింగరేణి కాలరీస్ మైన్స్ పరిధిలో దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ప్రచారం జరుగుతున్న ఆయన చెప్పారు. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తే రేవంత్ ప్రభుత్వం పోలీసులకు అడ్డుకుందని మండిపడ్డారు.

సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదని, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది రామచందర్ రావు గుర్తుచేశారు. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వానికి అక్కడ కనీసం ఒక అటెండర్‌ను నియమించే లేదా బదిలీ చేసే అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ అధికారాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయన్నారు. అందుకే కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ కు లేఖ రాశారన్నారు. బొగ్గు స్కామ్ ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆదేశించినట్లు చెప్పారు.

Advertisement

ఒకవేళ తప్పు చేయనప్పుడు బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని రామచందర్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బొగ్గు దొంగతనం వెనుక ఉన్న అసలు దొంగలెవరో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టాల్సి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదమని రాంచందర్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా చంపేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషనలైజేషన్ పేరిట స్కూళ్లను తగ్గించి, ఇప్పుడు మూసివేత దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

Also Read: అయ్యబాబోయ్.. కూలర్‌లో దూరిన పాము.. చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Advertisement

రాష్ట్రంలో 90 శాతానికి పైగా ప్రభుత్వ పాఠశాలలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని రామచందర్ రావు ఆరోపించారు. విద్యార్థినులకు ప్రత్యేక టాయిలెట్లు, కనీస మౌలిక వసతులు లేవని మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పాఠ్యపుస్తకాలు ప్రింట్ కాలేదని, యూనిఫారాలు అందలేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న డిమాండ్, స్టాండర్డ్స్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేవని ప్రశ్నించారు. చాలా జిల్లాల్లో డీఈవోలు, ఎంఈవోలు సరిగ్గా లేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు వచ్చి ప్రకటించిన రూ.1000 కోట్ల నిధుల హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తే ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం రైతులను వంచించడమేనని దుయ్యబట్టారు.

Also Read: టార్గెట్ మెట్రో ఫేజ్-2.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ.. రైల్వే మంత్రితో భేటికి డిమాండ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×