E-Paper
Advertisement

కంటికి కన్పించని అమ్మాయితో ప్రేమ పెళ్లి… ఖతర్నాక్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

కంటికి కన్పించని అమ్మాయితో ప్రేమ పెళ్లి… ఖతర్నాక్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Telugu Thriller Movie : నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మరీచిక’ (Mareechika 2026) ఒక ఇంటెన్స్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 29న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా, సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మరి ఈ క్రేజీ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) కాలేజీ విద్యార్థిని. కాలేజీ క్యాంటీన్ నడుపుతున్న సంజు (విరాజ్ అశ్విన్)ను ఆమె ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ తన ప్రేమను నోరు తెరిచి చెప్పలేకపోతుంది. ఇంతలో వెంకటలక్ష్మి ద్వారా సంజుకు మరీచిక (రెజీనా కసాండ్రా) అనే అమ్మాయి పరిచయమవుతుంది. తక్కువ సమయంలోనే సంజు, మరీచికలు ఒకరినొకరు ఇష్టపడతారు. ఆమె వెంకట లక్ష్మీ ఫ్రెండే. అంతేకాదు తాను ప్రేమించిన వాడికి, అతని ప్రేయసితో దగ్గరుండి పెళ్లి కూడా చేస్తుంది. వెంకటలక్ష్మి తన ప్రేమను త్యాగం చేసి వారికి సపోర్ట్ చేస్తుంది.

Advertisement

పెళ్లయిన రెండో రోజే సంజు హత్యకు గురవుతాడు. వెంకటలక్ష్మి ఆ హత్యను కళ్లారా చూసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ పోలీసులు “మరీచిక” అనే అమ్మాయి అసలు ఎవరూ లేదని చెబుతారు. సంజు చనిపోలేదని, అతను బతికే ఉన్నాడని తెలుస్తుంది. అయినా మరీచిక వెంకటలక్ష్మి, సంజు ఇద్దరికీ కనిపిస్తూనే ఉంటుంది.ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుండగా లక్ష్మి మానసిక స్థితి గురించి షాకింగ్ నిజాలు బయటపడతాయి. చిన్నప్పటి ట్రామా వల్ల ఆమె తీవ్రమైన ఫాంటసీ డిజార్డర్‌తో బాధపడుతుంది. తన ప్రేమను సాధించడానికి ఆమె ఆడిన సైకలాజికల్ గేమ్ ఏమిటి ? అసలు మరీచిక ఎవరు ? ఇది భ్రమా లేక వాస్తవమా ? అనే ప్రశ్నలకు సినిమాలో వచ్చే చివరి ట్విస్ట్‌లు సమాధానం ఇస్తాయి.

ఎక్కడ చూడాలి?

ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ మైండ్-బెండింగ్ థ్రిల్లర్‌ను ఓటీటీలో ఆస్వాదించవచ్చు.

Advertisement

ఈ థ్రిల్లర్ లో ప్రేమ, అసూయ, మానసిక సమస్యలు, భ్రమల మధ్య సాగే లోతైన సైకలాజికల్ జర్నీని అద్భుతంగా చూపించారు. అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ డెప్త్‌తో, రెజీనా కసాండ్రా మిస్టీరియస్ అవతారంలో, విరాజ్ అశ్విన్ నాచురల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. బలమైన సైకలాజికల్ ట్విస్టులు, అనుపమ – రెజీనా ఇంటెన్స్ యాక్టింగ్, తక్కువ రన్ టైమ్‌ తో ఉన్న క్రిస్ప్ నెరేషన్
సినిమాలో మెయిన్ హైలెట్స్.

Read Also : అమ్మాయి వెంటపడే ఆగంతకులు… ఆమె చేసిన పని చూస్తే బుర్ర బ్లాస్ట్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×