E-Paper
Advertisement

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం
Advertisement

Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రైతులు,యువకులు,విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మెదక్‌ జిల్లా పెద్దాపూర్ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రాహుల్ తప్పుపట్టారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలని సూచించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,100, పెట్రోల్‌ ధర రూ.110కి చేరినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా రాహుల్ గాందీ విమర్శలు గుప్పించారు .సీఎం కేసీఆర్‌ భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులు,కూలీలు, యువకులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి యువకుడు నిరుద్యోగం గురించి చెప్తున్నాడని వివరించారు. విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, ఆప్యాయత వల్ల పాదయాత్రలో అలసట రావడం లేదన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×