E-Paper
Advertisement

Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మల్లారెడ్డి జోష్.. బీఆర్ఎస్ గాలి వీస్తోందో అంటూ..!

Malla Reddy: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మల్లారెడ్డి జోష్.. బీఆర్ఎస్ గాలి వీస్తోందో అంటూ..!
Advertisement

Malla Reddy: స్వేఛ్చ బ్యూరో: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మళ్లీ కెసిఆర్(KCR) ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి(Malla Reddy) అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్, సోమారం గ్రామాల్లో మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి మల్లా రెడ్డి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎక్కడ చూసినా బీఆర్ఎస్..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పెద్ద ఎత్తున హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు మేడ్చల్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మల్లన్న జాతర సాగుతుందని, బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గాలి వీస్తుందని, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దూసుకుపోవడంఖాయమన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు.

Advertisement

Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజం శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ప్రైవేటు టెండర్లు..?

నేనే హామీ..

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. సొంత నిధులతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాని, ఇంకా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంచార్జీ వెంకట్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చామకూర మహేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, హరత్ రెడ్డి, నవీన్ రెడ్డి, జగన్ రెడ్డి, బారీ సంఖ్యలో కార్యక్రతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Chevireddy: నడిపించే నాయకుడు దొరికాడా? ఒంగోలులో చెవిరెడ్డికి ఘనస్వాగతం వెనుక అసలు కథ ఇదే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×