E-Paper
Advertisement

IND VS PAK: జియో హాట్‌స్టార్ కు రూ.4200 కోట్ల న‌ష్టం ? కొంప‌ముంచిన పాకిస్తాన్

IND VS PAK: జియో హాట్‌స్టార్ కు రూ.4200 కోట్ల న‌ష్టం ? కొంప‌ముంచిన పాకిస్తాన్
Advertisement

IND VS PAK: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup, 2026) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్ ( Pakistan boycott) రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడబోమని వెల్లడించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఐసీసీ తో పాటు బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో జియో హాట్ స్టార్ కు కూడా భారీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన నేపథ్యంలో జియో హాట్ స్టార్ కు ( jio hotstar) రూ.4200 కోట్లు నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్.. జియో హాట్ స్టార్ కు పెద్ద బొక్కే ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ కొలంబో వేదికగా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే బంగ్లాదేశ్ పట్ల ఇండియాతో పాటు ఐసీసీ చాలా దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో… టీమిండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ నంగనాచి కారణాలు చెబుతోంది. అయితే అర్ధాంతరంగా ఇలా మ్యాచ్ బహిష్కరిస్తే.. ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టర్లకు కూడా తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది.

ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ సేల్ అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ టోర్నమెంట్ మొత్తంలో ఎక్కువ ఆదాయాన్ని తీసుకువస్తుంది. అలాంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే జియో హాట్ స్టార్ కు ఎక్కువగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏకంగా 500 మిలియన్ డాలర్ల నష్టం జియో హాట్ స్టార్ కు జరుగుతుందని వార్తలు వైరల్ చేస్తున్నారు. అంటే దాదాపు 4200 కోట్లు అన్నమాట.

ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి

Advertisement

ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ నిజంగానే బహిష్కరిస్తే, ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అప్పుల పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు. అయితే 4200 కోట్ల నష్టం జరుగుతుందనేది అవాస్తవమని చెబుతున్నారు. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్ షిప్ టికెట్ల విక్రయాలు తదితర విభాగాలు అన్ని కలుపుకొని మొత్తం 2200 కోట్ల వరకు నష్టం జరుగుతుందని సమాచారం అందుతోంది. అయితే ఈ నష్టాన్ని మొత్తం బ్రాడ్కాస్టర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించేలా ఐసీసీ రూల్ పెట్టిందట. అంటే రిలయన్స్ జియోకు ఎంత నష్టం వచ్చినా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడటం గ్యారంటీ అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ జ‌రుగ‌క‌పోతే పాకిస్తాన్‌, ఇండియా బోర్డుల‌కు రూ.200 వ‌ర‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×