E-Paper
Advertisement

Ponnam Prabhakar: క్రైస్తవుల హక్కులను కాపాడుతాను.. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి..

Ponnam Prabhakar: క్రైస్తవుల హక్కులను కాపాడుతాను.. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి..
Advertisement

Ponnam Prabhakar: క్రైస్తవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందన్నారు.

రాష్ట్రంలో ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. హుస్నాబాద్‌లోని మోడల్ స్కూల్ లో విద్యార్థులకు కారం పెట్టిన ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజ్, ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

భూ నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేలా కృషి చేస్తానని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయనన్నారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. 24 గంటలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×