E-Paper
Advertisement

Etela: ఈటలకూ నోటీసులు.. బీజేపీనే టార్గెటా?

Etela: ఈటలకూ నోటీసులు.. బీజేపీనే టార్గెటా?
Advertisement
Etela Rajender notice

Etela: ఈ పోలీసులు ఉన్నారే.. టెన్త్ పేపర్ లీక్ కేసును పక్కా పొలిటికల్ కేసుగా మార్చేస్తున్నారు. పేపర్ బయటకు వచ్చిన కొన్నిగంటల్లోనే బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి.. ఆయనే ఏ1 అంటూ కేసు పెట్టి.. జైలుకు పంపించారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చి.. విచారణకు రమ్మని పిలిచారు.

ఇంతకీ ఈటల చేసిన తప్పేంటంటే.. ఆయనకు కూడా వాట్సాప్‌లో పేపర్ రావడం. ఏ2 ప్రశాంత్ అనేక మందికి టెన్త్ పేపర్ సెండ్ చేశాడని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. వారిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈటల పీఏలకు కూడా పేపర్ పంపించారు. అయినా, ఆయనపై తామేమీ కేసు పెట్టలేదంటూ బుధవారం ప్రెస్‌మీట్లో క్లారిటీ ఇచ్చారు సీపీ.

Advertisement

కట్ చేస్తే, గురువారం కల్లా సీన్ మారిపోయింది. ఎక్కడినుంచి ఆదేశాలు వచ్చాయో కానీ.. ఈటల రాజేందర్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. 160 సీఆర్‌పీసీ విట్నెస్ కింద నోటీసు అందజేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరు కావాలని నోటీసులో తెలిపారు.

తానేం తప్పు చేశానని తనకు నోటీసులు ఇచ్చారంటూ ఈటల రాజేందర్ మండిపడుతున్నారు. తనకు వాట్సాప్ అంటే ఏంటో కూడా తెలీదని.. తన ఫోన్లను పీఏలే హ్యాండిల్ చేస్తారని చెప్పారు. తనకెవరో ఏదో పంపించినంత మాత్రాన విచారణకు పిలుస్తారా? అని పోలీసుల తీరును తప్పుబడుతున్నారు రాజేందర్.

Advertisement

పేపర్ లీక్ ఘటనలో ఈటలపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం గట్రా చేయకపోయినా.. ఇలా నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచి.. బీజేపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడమే బీఆర్ఎస్ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు కమలనాథులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×