// // Car On Railway Track: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు.. సాంకేతిక సమస్యతో రైల్వే గేటు లాక్.. డ్రైవర్ పరుగో పరుగు -->
E-Paper
Advertisement

Car On Railway Track: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు.. సాంకేతిక సమస్యతో రైల్వే గేటు లాక్.. డ్రైవర్ పరుగో పరుగు

Car On Railway Track: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు.. సాంకేతిక సమస్యతో రైల్వే గేటు లాక్.. డ్రైవర్ పరుగో పరుగు
Advertisement

Car On Railway Track: రైలు గేటు పడుతున్న శబ్దం రాగానే బైక్ లు, కార్ల వేగం పెరిగిపోతుంది. ఎంతో ముఖ్యమైన పనులు ఉన్నట్లు గేటు పడనివ్వకుండా గేటు దాటవేయడానికి మహా కంగారు పడిపోతుంటారు. ఇక బైకర్లు అయితే రైలు గేటు కింద నుంచి దూరి మరీ వెళ్లిపోతుంటారు. కాసేపు ఆగితే ప్రపంచం స్తంభించిపోతుందని అనుకుంటారు కొందరు. ఇలా హడావుడిగా రైలు గేటు దాటేందుకు ప్రయత్నించిన ఓ కారు ట్రాక్ పై దూసుకొచ్చింది. ఇంతలో రైలు గేటు పడింది. కారు వెనుక భాగం పట్టాలపై ఉండిపోయింది.

మరో పక్క రైలు వేగంగా దూసుకొస్తుంది. కారును బయటకు తీసుకెళ్లేందుకు గేటు తెరవమని కారు డ్రైవర్ గేటు సిబ్బంది కోరాడు. ఇంతలో రైల్వే గేటు కాస్త జామ్ అయింది. సాంకేతిక సమస్యతో ఎంతసేపు ప్రయత్నించిన ఆటోమేటిక్ లాగ్ ఓపెన్ కాలేదు. పరిస్థితిని గమనించిన కారు డ్రైవర్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇక రైల్వే సిబ్బందికి హైటెన్షన్. ఉరుకులు పరుగులతో రైల్వే సిబ్బంది ముందుగా రైల్వే స్టేషన్ కు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత చాలా సేపు కష్టపడి రైల్వే గేటును తెరిచారు. ఈ ఘటన శనివారం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

Advertisement

పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే గేటు వద్ద రైలు వస్తుండగా ఒక కారు వేగంగా పట్టాలపైకి దూసుకొచ్చి గేటు లోపల నిలిచిపోయింది. రెండో గేటు పడిపోవడంతో కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి వెళ్లిపోయాడు. సాంకేతిక లోపంతో గేట్లు తెరుచుకోకపోవడంతో, రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రెండు వైపులా రైళ్లను ఆపి, గేటును తెరిచారు. ఆ తర్వాత కారును సురక్షితంగా బయటకు తీశారు.

పట్టాలపైకి కారు

రైల్వే గేటు తెరుచుకోకపోవడం, పట్టాలపై కారు, ఇంతలో రైలు కూత.. కాసేపు ఏం జరుగుతుందో తెలియక గేటు వద్ద పరిస్థితి భయంభయంగా మారింది. హనుమంతునిపేటకు చెందిన ఓ వ్యక్తి తన కారులో పెద్దపల్లి వైపు వస్తున్నారు. గేటు పడేలోపు పట్టాలు దాటేద్దామని ప్రయత్నించిన కారు డ్రైవర్.. గేటు పడిపోవడంతో రైలు పట్టాలపై చిక్కుకుపోయాడు.

Advertisement

కాసేపు రాకపోకలకు అంతరాయం

డ్రైవర్ ఎంత ప్రయత్నించినా గేటు పైకి లెగకపోవడంతో, అతడు అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. రైలు వస్తున్న శబ్దం వినిపించడంతో గేట్ మ్యాన్ వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి, రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఇరువైపులా రైళ్ల రాకపోకలను ఆపి, గేటును బాగు చేశారు. కాసేపటి తర్వాత గేటు తెరుచుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కారు బయటకు రావడంతో తిరిగి యథావిధిగా రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.

Also Read: Messi – CM Revanth Reddy: మెస్సీ హైద‌రాబాద్ మ్యాచ్‌లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా సీఎం రేవంత్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×