E-Paper
Advertisement

Hardik Pandya: AMB సినిమాస్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. అఖండ 2 కోసమేనా?

Hardik Pandya: AMB సినిమాస్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. అఖండ 2 కోసమేనా?
Advertisement

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా హైదరాబాద్ లోని మహేష్ బాబుకు చెందిన ఏఎంబి సినిమా మాల్ ని సందర్శించి సినీ అభిమానులను, క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని తాజాగా ఏఎంబి సినిమాస్ బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ” క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన పవర్ హిట్టింగ్, బౌలింగ్ స్పెల్స్, చాకచక్యమైన ఫీల్డింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే.

Also Read: NZ vs WI: 148 ఏళ్ల చ‌రిత్ర‌.. రెండో ఇన్నింగ్స్ 400ల‌కు పైగా స్కోర్ చేసిన వెస్టిండీస్‌

Advertisement

కానీ ఇప్పుడు మైదానం బయట కూడా హార్దిక్ పాండ్యా తన గ్లామర్, ఫన్నీ మూమెంట్స్, స్టైల్ మరియు పబ్లిక్ అప్పీరియన్స్ తో ఆల్ రౌండ్ ప్రతిభ చూపించాడు” అని ఎంబీఏ సినిమాస్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు.. బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా చూసేందుకే ఏఎమ్.బి మాల్ కి వచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా హైదరాబాద్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

 

హార్దిక్ పాండ్యా కోసం పోటెత్తిన అభిమానులు:

Advertisement

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ఆడుతున్న టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోసం అభిమానులు పోటెత్తారు. అయితే తప్పనిసరి పరిస్థితులలో మ్యాచ్ వేదికను తరలించాల్సి వచ్చింది. గురువారం రోజు జింఖానా మైదానంలో బరోడా – గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ని షెడ్యూల్ చేశారు. కానీ జట్టు బస చేసిన హోటల్ వద్ద, ప్రాక్టీస్ సమయంలో, టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు భారీగా గుమిగూడడాన్ని నిర్వాహకులు గమనించారు. దీంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్ వేదికను జింఖానా నుండి ఉప్పల్ స్టేడియానికి మార్చారు. మ్యాచ్ ని సాఫీగా కొనసాగించడంతోపాటు ఆటగాళ్లు, అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఇక గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో బరోడా ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 10 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read: Rohit – Kohli: రోహిత్ శర్మ భార్యతో కోహ్లీ రొమాంటిక్ ఫోటో..!

 

హైదరాబాద్ లో టాప్ క్లాస్ థియేటర్ ఏఎంబి సినిమాస్:

ఏఎంబి సినిమాస్ హైదరాబాద్ లో టాప్ క్లాస్ థియేటర్ గా నిలిచింది. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు, స్పెషల్ షోలు, ఫ్యాన్ ఈవెంట్లకు హాట్ స్పాట్ గా మారింది. ఈ మల్టీప్లెక్స్ ని సూపర్ స్టార్ట్ మహేష్ బాబు ఏసియన్ గ్రూప్ {సునీల్ నారాయణ్ నాయకత్వంలోని ప్రముఖ థియేటర్ చైన్} తో కలిసి జాయింట్ వెంచర్ గా స్థాపించాడు. దేశంలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ లకు పోటీగా ఉండేలా.. ఇకపై మరిన్ని సెంటర్లను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గచ్చిబౌలిలో ఉన్న ఈ ఏఎంబి సినిమాస్ ని హార్దిక్ పాండ్యా సందర్శించడంతో ఏఎంబి సినిమా మాల్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×