E-Paper
Advertisement

Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?

Paddy Procurement: ఏప్రిల్1 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. ఈ సారీ క్వింటాల్ ధర ఎంతో తెలుసా..?
Advertisement

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారుల ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా, రైస్ మిల్లర్ అసోసియేషన్ యాజమాన్యాలతో యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఏప్రిల్ 1 నుంచి..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు లో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు. ప్రభుత్వo ఒక క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి 2,389 ,సాధారణ రకానికి 2,369 గా నిర్ణయించిందన్నారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించాలని పిలుపునిచ్చారు. యాసంగి సీజన్ కు 4’45’466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా 413 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఐకెపి 154, పిఎసిఎస్ 224, డీసీఎంఎస్ 9, ఎఫ్ పి ఓ 26 , మొత్తం 413 కేంద్రాలు ప్రారంభం కానున్నాయి అన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామన్నారు.

Advertisement

Also Read: Crime News: మేడ్చల్‌ బస్టాండ్‌లో పట్టపగలు గంజాయి బ్యాచ్ కలకలం

ప్యాడి క్లీనర్లు..

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. వడగండ్లు, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సరైన తేమశాతాన్ని నమోదు చేసి, ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని, ప్యాడి క్లీనలలో సమస్యల తలెత్తితే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డిఓ రమాదేవి, గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి… దేవ్ కుమార్.. జిల్లా సివిల్ సప్లై అధికారి. నిత్యానంద్ , సివిల్ సప్లై మేనేజర్. జగదీష్. ట్రాన్స్పోర్ట్ అధికారినీ.. శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: SADAREM: గుడ్ న్యూస్.. సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తున్నారా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×