E-Paper
Advertisement

శివయ్య ఆశీస్సులతో కొడుకుకు పేరు పెట్టిన ఆది సాయికుమార్..ఎంత క్యూట్ గా ఉందో!

శివయ్య ఆశీస్సులతో కొడుకుకు పేరు పెట్టిన ఆది సాయికుమార్..ఎంత క్యూట్ గా ఉందో!
Advertisement

Aadi Sai Kumar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు సాయికుమార్ వారుసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆది వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన ఆది తాజాగా శంభాల (Shambhala)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తిరిగి అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

కొడుకుకు జన్మనిచ్చిన ఆది సాయికుమార్

ఇక ఆది సాయికుమార్ కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన అరుణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల ఈ దంపతులు కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా అరుణ ఆది దంపతులకు కొడుకు పుట్టడంతో వీరి కుటుంబంలో సంతోషాలు వెల్లువిరిసాయి. ఇప్పటివరకు తన కొడుకు ఎలా ఉంటారనే విషయాన్ని మాత్రం ఆది సాయికుమార్ రివీల్ చేయలేదు. ఇకపోతే నేడు ఈ చిన్నారికి నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

ఇషాన్ కార్తికేయ..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆది సాయికుమార్ తన కొడుకు పేరును సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈరోజు తన కొడుకుకు పేరు పెట్టామని తెలిపారు. ఆ శివుడి ఆశీస్సులతో అలాగే కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ (Ishan Karthik)అనే పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆది సాయికుమార్ తన కొడుకు పేరును రివిల్ చేయడంతో అభిమానులు పేరు చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈరోజు నామకరణ వేడుకను నిర్వహించినప్పటికీ ఇషాన్ కార్తీక్ ఎలా ఉంటారనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

Advertisement

ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. శంభాల సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆది తన తదుపరి చిత్రం ఈగో రాజా (Ego Raja)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.ఈ సినిమాను ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మించగా ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. శంభాల మంచి సక్సెస్ కావడంతో ఆది విభిన్నమైన కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: జననాయగన్  రాకకు సర్వం సిద్ధం .. అప్పటివరకు ఎదురుచూడాల్సిందే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×