E-Paper
Advertisement

ORR Accidents: కంట్రోల్ తప్పితే కైలాసమే.. ఈ రోడ్లపై ప్రతి నాలుగు రోజులకు ఒకరు బలి..?

ORR Accidents: కంట్రోల్ తప్పితే కైలాసమే.. ఈ రోడ్లపై ప్రతి నాలుగు రోజులకు ఒకరు బలి..?
Advertisement

ORR Accidents: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజధానికి మణిహారం లాంటి జవహర్​ లాల్ నెహ్రూ ఔటర్​ రింగు రోడ్డు యమ డేంజర్​ గా మారింది. ఈ రోడ్డుపై నెలకు సరాసరిన 18కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతీ నాలుగు రోజులకొకరు మృత్యువాత పడుతుండగా రెండు రోజులకొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇటీవల ఇదే రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్​ లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇద్దరు కూతుళ్లు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాహనదారుల నిర్లక్ష్యమే అని అధికారులు చెబుతున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపిస్తుండటం…నిబంధనలను ఏమాత్రం పాటించక పోతుండటం వల్లనే ఓఆర్​ఆర్​ పై తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

రోడ్డుకు ఇరువైపులా..

స్పీడ్​ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్ అని రాసి ఉన్న సైన్​ బోర్డులు ఔటర్​ రింగు రోడ్డుపై పలు చోట్ల కనిపిస్తూ ఉంటాయి. అయితే, ముఖ్యంగా కార్లు నడుపుతున్న వారు ఈ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇరువైపులా నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది లైన్లతో ఓఆర్​ఆర్​ నిర్మించినపుడు దీనిపై గరిష్ట వేగం 80 కిలోమీటర్లుగా అధికారులు నిర్ణయించారు. అంతకు మించి వేగంతో వెళితే చర్యలు తీసుకునేవారు. వాహనాల వేగాన్ని గమనించటానికి అప్పట్లో ఓఆర్​ఆర్ పై స్పీడ్​ గన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక, ఒక్కో లైన్​ లో ఎడమ వైపు ఉండే మొదటి రెండు లైన్లను భారీ వాహనాలు, గూడ్స్​ లారీలకు కేటాయిస్తే కుడివైపు ఉండే లైన్ల మీదుగా కార్లు వెళ్లాలి. కాగా, కొంతకాలం క్రితం అధికారులు స్పీడ్​ లిమిట్​ నిబంధనను సడలించారు. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పలువురు వాహనదారులు ఓఆర్​ఆర్​ పై పట్టపగ్గాలు లేకుండా డ్రైవింగ్​ చేస్తున్నారు.

జిగ్​ జాగ్ గా వాహనాలు

Advertisement

నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో రయ్యిన దూసుకెళుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా గాలితో పోటీ పడుతున్నట్టు వెళుతున్న వారు జిగ్​ జాగ్ గా వాహనాలు నడుపుతుండటం. నిబంధనల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని కుడివైపు నుంచి మాత్రమే ఓవర్ టేక్​ చేయాలి. అది కూడా కుడివైపు ఉన్న ఇండికేటర్​ ను ఆన్ చేసిన తరువాత. ఓఆర్​ఆర్​ పై వాహనాలు నడుపుతున్న వారిలో చాలామంది దీనిని పాటించటం లేదు. ఎటువైపు ఖాళీ కనిపిస్తే అటువైపు నుంచి ముందుకు దూసుకెళుతున్నారు. ఇండికేటర్లు కూడా వేయకుండా సడన్​ గా లైన్లు మారుస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండటంతోపాటు అవతలివారిని మృత్యుముఖంలోకి నెడుతున్నారు.

Also Read: గ్రామ పంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్ల దందా.. పెళ్లి కాకపోయినా సర్టిఫికేట్ జారీ..!

పార్క్ చేస్తున్న వాహనాలను..

Advertisement

ఇక, వాహనాలు రిపేరుకు వచ్చినా, డ్రైవర్లకు విశ్రాంతి అవసరమైనా ఓఆర్​ఆర్ పై దీని కోసం సౌకర్యాలు ఉన్నాయి. నిర్ణీత దూరానికి ఒకటి చొప్పున బ్రేక్​ డౌన్​ పాయింట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ల వద్ద లారీలు మొదలుకుని కార్ల వరకు ఎవరైనా తమ తమ వాహనాలను పార్క్​ చేసుకోవచ్చు. ఇక, ఈ బ్రేక్​ డౌన్​ పాయింట్ల వద్ద కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా వసతులు కల్పించారు. అయితే, చాలామంది లారీ డ్రైవర్లు తమ తమ లారీలను ఓఆర్​ఆర్ పై ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు ఎడమ వైపు పార్క్ చేస్తున్నారు. ఇలా పార్క్ చేస్తున్న వాహనాలను వెనక నుంచి వచ్చి ఢీకొడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ కారైనా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఉంటేనే డ్రైవర్ ఆధీనంలో ఉంటుందని ఈ ఫీల్డ్ లో ఉన్నవారు చెబుతున్నారు. అంతకు మించి వేగంతో నడిపితే వాహనం కంట్రోల్​ లో ఉండదన్నారు.

స్వీయ నియంత్రణ అవసరం

దీనికి కారణం పవర్ స్టీరింగులే అని చెప్పారు. ఓవర్​ స్పీడ్ లో స్టీరింగ్ ను అర అంగుళం పక్కకు తిప్పినా…దానిపై అరసెకనుపాటు అదుపు కోల్పోయినా ఏటో ఒక వైపు దూసుకెళ్లి పోతుందని వివరించారు. దీనివల్ల ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని చెప్పారు. పోలీసు అధికారులతో మాట్లాడితే వాహనదారులు వాహనదారులకు స్వీయ నియంత్రణ అవసరమన్నారు. పరిమితికి మించిన వేగంతో అస్సలు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అప్పుడే కొంతలో కొంత ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.

Also Read: ఇక దొంగ హజర్లు కుదరవు.. ఉపాధి హామీ పనిలో కీలక మార్పులు చేసిన సర్కార్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×