E-Paper
Advertisement

Telangana Rains : చినుకు జాడేది..? ఆందోళనలో రైతులు.. వర్షాల కోసం ఎదురుచూపు..

Telangana Rains : చినుకు జాడేది..? ఆందోళనలో రైతులు.. వర్షాల కోసం ఎదురుచూపు..
Advertisement

Rain news today Telangana(Today news in telangana):

తెలంగాణలో చినుకు జాడ లేక అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాకాల సీజన్‌లో ఇప్పటికే మూడు నెలలు ముగిసిపోయింది. అతివృష్టి, అనావృష్టితో పంటసాగులో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. జూన్‌ నెల వర్షాభావంతో మొదలు కాగా.. జులైలో అధిక వర్షాలు, వరదలు సాగుకు ఆటంకం కలిగించాయి. కానీ నీటివనరులు కొద్దో గొప్పో నిండటంతో పంటలసాగు మొదలైంది.

ప్రస్తుతం వరినాట్లు పూర్తవుతున్నాయి. ఇతర పంటలు మొలకల దశలో ఉన్నాయి. ఈ తరుణంలో పంటలకు నీటితడి అవసరం ఉంది. కానీ ఆగస్టులో వర్షాభావం నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాతావరణశాఖ ప్రకటనతో ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు.

Advertisement

సెప్టెంబర్ ఆరంభం నుంచే భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వెల్లడించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. దీంతో కాస్త ఆశాజనకంగా మారింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణశాఖ.

ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో రైతులు ఈ నెలలో వానలు పడతాయని ఆశలు పెట్టుకున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×