E-Paper
Advertisement

Aditya-L1 Mission : నేడు కౌంట్ డౌన్ స్టార్ట్.. ఆదిత్య- L1 ప్రయోగానికి సర్వం సిద్ధం..

Aditya-L1 Mission : నేడు కౌంట్ డౌన్ స్టార్ట్..  ఆదిత్య- L1 ప్రయోగానికి సర్వం సిద్ధం..
Advertisement

Aditya-L1 Mission : సూర్యుడిపై పరిశోధనలకు సిద్ధమైంది ఇస్రో. శనివారం శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి PSLV-C57 రాకెట్‌ ద్వారా ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని చేపడతారు.

ఆదిత్య ఎల్1 ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు ఇప్పటికే PSLV-C57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించారు. దాన్ని లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్‌ ఛైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Advertisement

గురువారం షార్‌లో LPSC డైరెక్టర్ నారాయణన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ప్రయోగంలోని వివిధ అంశాలపై చర్చించారు. వాహకనౌక అనుసంధానం, ఉపగ్రహ అమరిక, రిహార్సల్‌ అంశాలపై శాస్త్రవేత్తలు సమీక్షించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించారు. ప్రయోగం చేపట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టతకు వచ్చారు.

లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ రాజరాజన్‌ ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ఇస్రో అధిపతి సోమనాథ్‌ గురువారం రాత్రి షార్‌కు చేరుకున్నారు. సోమనాథ్ 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ శ్రీహరికోటకు రానున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×