E-Paper
Advertisement

Nizamabad News: భార్య బావ ఇంటి ముందు భర్త ధర్నా.. పెళ్లైన నాలుగు నెలలకే అంటూ ఆరోపణలు

Nizamabad News: భార్య బావ ఇంటి ముందు భర్త ధర్నా.. పెళ్లైన నాలుగు నెలలకే అంటూ ఆరోపణలు
Advertisement

Nizamabad News: నిజామాబాద్ లో ఓ వ్యక్తి తన భార్య మోసం చేసిందని ధర్నాకు దిగాడు. పెళ్లైన నాలుగు నెలల్లోనే భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణ చేస్తున్నాడు భర్త ప్రశాంత్. బావ వరుసైన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. అతడి ఇంటి ఎదుట బైఠాయించాడు బాధితుడు. తనకు న్యాయం చేయాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. తన భార్యతో లింబాద్రితో చేసిన చాటింగ్ లు ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆగస్ట్ 13న ప్రశాంత్ వివాహం కాగా.. పెళ్లిన నాలుగు నెలలకే భార్య వెళ్లిపోయింది. గత కొంత కాలంగా తన భార్య తనను మోసం చేసిందని వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్న బాధితుడు.. తాజాగా లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు.

Also Read: School Bus Accident: శంషాబాద్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. పాఠశాల బస్సు బోల్తా.. స్పాట్‌లో 60 మంది 

బావతో వివాహేతర సంబంధం

Advertisement

ప్రశాంత్‌కు, సంయుక్త అనే మహిళతో ఈ ఏడాది ఆగస్టు 13న వివాహమైంది. కొన్ని నెలలు బాగానే సాగిన తర్వాత.. భార్య ప్రవర్తనలో మార్పును గమనించాడు ప్రశాంత్. భార్య ప్రవర్తనపై అనుమానంతో… ఫోన్ ను పరిశీలించగా బావ వరుసైన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలిసింది. పెళ్లికి ముందు నుంచి వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతోందని ప్రశాంత్ గుర్తించాడు. వారిద్దరి మధ్య జరిగిన అసభ్యకరమైన వాట్సాప్ చాటింగ్‌లు, ఫొటోలను చూసి ప్రశాంత్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయంపై భార్యను నిలదీసినట్లు తెలుస్తోంది. అలాగే వాట్సాప్ చాటింగ్ లను సాక్ష్యంగా తన వద్ద పెట్టుకున్నాడు.

వాట్సాప్ చాటింగ్ లు స్టేటస్ లో

తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయాలని భార్య బావ ఇంటి ముందు ధర్నాకు దిగాడు. భార్య సంయుక్త, ఆమె బావ లింబాద్రి ఫొటోలతో ఉన్న ఓ ఫ్లెక్సీ తయారు చేయించి… ఆ ఫ్లెక్సీని తీసుకుని నేరుగా లింబాద్రి ఇంటి ముందు ధర్నా చేశాడు. భార్య తనను మోసం చేసిందని, వీరిద్దరి వల్ల తన జీవితం నాశనమైందని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. భార్య, తన బావతో చేసి వాట్సాప్ చాటింగ్ లను కొంతకాలంగా వాట్సాప్ స్టేటస్‌లు కూడా పెట్టుకుంటున్నాడు. తన భార్య మోసాన్ని ఎండగడుతూ పోస్టులు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే గత్యంతరం లేక ధర్నాకు దిగినట్లు బాధితుడు ప్రశాంత్ చెబుతున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సంయుక్త తరపు బంధువులు ప్రశాంత్ ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీని లాగేసుకుని, అతడిని అక్కడ్నుంచి పంపినట్లు తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×