E-Paper
Advertisement

Vyjayanthi Movies : వైజయంతి కోసం ఎప్పుడు పడితే అప్పుడు చనిపోయే హీరో

Vyjayanthi Movies : వైజయంతి కోసం ఎప్పుడు పడితే అప్పుడు చనిపోయే హీరో
Advertisement

Vyjayanthi Movies : హీరో చనిపోతాడు అంటే… అది హీరోయిన్ కోసమో.. ఫ్రెండ్ కోసమో.. కథ కోసమో అయి ఉంటుందని అనుకుంటారు. కానీ, ఓ హీరో మాత్రం వీటి కోసం కాదు… నిర్మాతల కోసం చనిపోతున్నాడు. అతను ఎవరో కాదు.. దుల్కర్ సల్మాన్.

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్… తెలుగు హీరో అవ్వడానికి కారణం సీతారామం. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడమే కాదు… దుల్కర్ సల్మాన్ అనే మలయాళ హీరోను తెలుగు హీరోగా మార్చేసింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించారు. ఆ సినిమాలో కథ పరంగా హీరో చనిపోవాల్సి వస్తుంది.

Advertisement

అక్కడి వరకు బానే ఉంది. కానీ, ఆ ఒక్క సారి చనిపోయినందుకు.. దుల్కర్ సల్మాన్ పాత్రను చాలా సినిమాల్లో చంపేస్తు వస్తూనే ఉన్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సినిమాల్లో ఏదైనా చనిపోయే పాత్ర ఉంటే… వాళ్లకు దుల్కర్ సల్మానే గుర్తు వస్తున్నట్టు ఉన్నాడు.

కల్కి సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించాడు. స్క్రీన్ పై అలా కనిపించి… ఇలా మాయం చేశారు అప్పుడు. చనిపోతాడా లేదా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్నా… దుల్కర్ మాత్రం కొన్ని క్షణాలు మాత్రమే కనిపించాడు.

Advertisement

అచ్చం అలాగే… ఛాంపియన్ సినిమాలో కూడా హీరో తండ్రి పాత్రలో కనిపించాడు దుల్కర్ సల్మాన్. ఇక్కడ కూడా అంతే.. స్క్రీన్ పై కొన్ని సెకన్లు మాత్రమే అలా కనిపించి.. ఇలా మాయమైపోతాడు. మాయపోవడం అంటే కల్కీ మూవీలా కాకుండా.. ఇక్కడ హీరో తండ్రి పాత్ర చనిపోతుంది.

ఈ రోజు ఛాంపియన్ సినిమాలో దుల్కర్‌ను చూసిన తర్వాత.. పాపం ఒక్క సినిమాలో చనిపోయే పాత్ర చేస్తే.. ఇక అన్నీ సినిమాల్లో తన పాత్రను చంపేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే, వైజయంతి మూవీస్‌ బ్యానర్‌తో ఒక్క సారి ట్రావెల్ అయితే.. ఆ బ్యానర్‌లో వచ్చే సినిమాల్లో అతిథి పాత్రల్లో స్టార్లు కనిపించడం కొత్తేమీ కాదు. ఈ విషయాన్ని చాలా మంది హీరోలు చెప్పారు. అయితే, చనిపోయే పాత్రకు ప్రతిసారి దుల్కర్ సల్మాన్‌నే తీసుకోవడంతో ఒకింత ట్రోల్స్ వస్తున్నాయని చెప్పొచ్చు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×