E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. నిఖిల్ డే టీమ్ భేటీ.. ప్రత్యేక పోర్టల్‌కు విజ్ఞప్తి

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో.. నిఖిల్ డే టీమ్ భేటీ.. ప్రత్యేక పోర్టల్‌కు విజ్ఞప్తి
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం ప్రత్యేకంగా కలిసింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై వారు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజా వాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లాలని బృందం సూచించింది.

నిఖిల్ డే టీమ్ సూచనపై సానుకూలంగా స్పందించిన సీఎం.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణ లోనూ ‘ప్రజా సూచన పోర్టల్ ‘ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోట ఈ పోర్టల్​ లో అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఐటీ శాఖ ద్వారా ఈ పోర్టల్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: Bhu Bharati Portal: ఏప్రిల్ 2 నుంచి కొత్త శకం.. భూభార‌తి పోర్టల్ షురూ.. మంత్రి పొంగులేటి

మరోవైపు తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్ ను నిఖిల్ డే ప్రశంసించారు. ఈ బిల్ దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ భేటిలో తమ కీలక అభిప్రాయాలను సైతం వారు అందించారు.

Advertisement

Also Read: Jio Recharge Plan: జియో నయా ప్లాన్.. 25GB డేటా, ఫ్రీ ఓటీటీలు.. 3 నెలల పాటు నాన్ స్టాప్ వినోదం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×