E-Paper
Advertisement

2026 Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450, టీజర్ అదిరింది భయ్యా!

2026 Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450, టీజర్ అదిరింది భయ్యా!
Advertisement

2026 Royal Enfield Guerrilla 450: పాపులర్ బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త 2026 గెరిల్లా 450 బైక్‌ ను అధికారికంగా విడుదల చేయడానికి ముందు టీజ్ చేసింది. మార్చి 27న లాంచ్ కాబోతున్న ఈ బైక్ గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ, కొన్ని కీలక అప్‌డేట్స్ ఉండబోతున్నట్లు ఈ టీజర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్.

2026 గెరిల్లా 450 బైక్‌ గురించి..

గెరిల్లా 450 జాయ్ ఫుల్ రైడింగ్‌  అనుకూలంగా ఉండే బైక్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో కొన్ని చిన్న లోపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ టైర్లు ఎక్కువ గ్రిప్ ఇవ్వకపోవడం,  వెనుక సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉండటం వల్ల గుంతలు ఉన్న రోడ్లపై రైడ్ అంత కంఫర్ట్‌ గా అనిపించదు. ఈ లోపాలను దృష్టిలో పెట్టుకుని, కొత్త 2026 మోడల్‌ లో కంపెనీ కీలక అప్ డేట్స్ చేయనుంది. కొత్త గెరిల్లా 450లో మెరుగైన గ్రిప్ ఉన్న టైర్లు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల రోడ్డుపై స్టేబిలిటీ పెరుగుతుంది. అలాగే, సస్పెన్షన్ డంపింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. రఫ్ రోడ్లపై కూడా రైడ్ మరింత సాఫ్ట్‌ గా ఉంటుంది.

2026 గెరిల్లా 450 డిజైన్ గురించి..

Advertisement

2026 గెరిల్లా 450 డిజైన్ విషయానికి వస్తే.. పెద్ద మార్పులు ఉండకపోయినా, కొత్త కలర్ ఆప్షన్లు, గ్రాఫిక్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవి బైక్‌ కు మరింత మోడ్రన్ లుక్ ఇస్తాయి. యంగ్ రైడర్స్‌ ను మరింతగా ఆకట్టుకోనున్నాయి. ఈసారి ఈ బైక్ కు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌ షిఫ్టర్ లాంటి అడ్వాన్స్ ఫీచర్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇవి ఇప్పటికే 500cc లోపు బైక్స్‌ లో వస్తున్నాయి. సో, గెరిల్లా 450లో ఇవి ఉంటాయని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి ఉంటే, రైడింగ్ మరింత సేఫ్‌గా, ఈజీగా మారుతుంది.

ఇంజిన్ విషయంలో నో ఛేంజెస్..

ఇంజిన్ విషయానికి వస్తే..  పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.. ఈ బైక్‌లో 452cc లిక్విడ్ కూల్డ్ షెర్పా ఇంజిన్ కొనసాగుతుంది. ఇది సుమారు 40bhp పవర్, 40Nm టార్క్ను అందిస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌ బాక్స్ కూడా  ఉంటుంది. పనితీరు ఇప్పటికే బాగానే ఉన్నందున, కంపెనీ దానిని మార్చాల్సిన అవసరం లేదని భావిస్తోంది.

2026 గెరిల్లా 450 ధర గురించి..

Advertisement

2026 గెరిల్లా 450 ధర విషయానికి వస్తే..  కొత్త అప్‌డేట్స్ కారణంగా ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది.  అదనపు ఫీచర్లు, మెరుగైన రైడ్ క్వాలిటీ చూస్తే ఈ ధర ఓకే అంటున్నారు రైడర్స్. 2026 గెరిల్లా 450 మంచి హ్యాండ్లింగ్, మెరుగైన కంఫర్ట్, కొత్త ఫీచర్లతో యువ రైడర్స్‌ కు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. మార్చి 27న లాంచ్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Read Also: ఎలక్ట్రిక్ కార్లలో టైర్లు త్వరగా అరిగిపోతాయా? అసలు మ్యాటర్ ఏంటంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×