// // Malkajgiri Office: కొత్త మున్సిపల్ శాఖకు భూమి కేటాయింపు -->
E-Paper
Advertisement

మల్కాజిగిరి కొత్త మున్సిపల్ శాఖకు భూమి కేటాయింపు.. ఎక్కడంటే..?

మల్కాజిగిరి కొత్త మున్సిపల్ శాఖకు భూమి కేటాయింపు.. ఎక్కడంటే..?
Advertisement

Malkajgiri Office: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్‌లో ఇటీవలే కొత్తగా ఏర్పడిన మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ సొంత భవనం కోసం సర్కారు ఉప్పల్ భగాయత్ లే ఔట్ -3 లోని సర్వే నెంబర్ 264, 265,266, 267, 268, 276, 278, 279, 280 ల్లోని దాదాపు పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ సర్కారు సోమవారం జీఓ జారీ చేసింది. మొత్తం పది ఎకరాల్లో రానున్న 30 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని నిర్మించనున్న ఈ భవనాలకు సుమారు రూ. 98 కోట్లను కూడా కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉప్పల్ భగాయత్‌లో..

2012 ఈ భూమిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జీవో నెంబర్ 571 ద్వారా ఈ భూమిని సేకరించింది. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కూడా ఈ ప్రతిపాదనను గత ఆర్థిక సంవత్సరంలోనే ఆమోదించినట్లు పేర్కొంది. ప్రస్తుతం తార్నాకలోని హెచ్ఎండీఏ ఆఫీసులో కొనసాగుతున్న ఎంఎంసీ ప్రధాన కార్యాలయాన్ని ఉప్పల్ భగాయత్ లో నిర్మించేందుకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిసింది.

Advertisement

Also Read: హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు సమీపంలో హైస్పీడ్ రైల్..!

రూ. 200 కోట్లు..

ఇదిలా ఉండగా, ప్రస్తుతం మాదాపూర్‌లోని న్యాక్ భవనంలో కొనసాగుతున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి కూడా సర్కారు కైతలాపూర్‌లో భూమిని కేటాయించినట్లు, రూ. 200 కోట్లను కూడా కేటాయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత జనవరి 11న కొత్తగా ఏర్పాటైన ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు కేటాయించిన భూముల్లో ఏడాది కాలంలోనే సొంత భవనాలను నిర్మించుకోవాలని రెండు కార్పొరేషన్లు డెడ్ లైన్లు విధించుకున్నట్లు తెలిసింది.

Advertisement

Also read: కూటమి సర్కారులో కుల చిచ్చు.. శ్రీకాకుళంలో మిత్రుల మధ్యే యుద్ధం?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×