// // US Naval Blockade Iran Ports: దిగ్బంధం మొద‌లైంది.. వచ్చేవారిని అడ్డుకుంటాం.. అడ్డొచ్చేవారిని పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్ -->
E-Paper
Advertisement

దిగ్బంధం మొద‌లైంది.. వచ్చేవారిని అడ్డుకుంటాం.. అడ్డొచ్చేవారిని పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

దిగ్బంధం మొద‌లైంది.. వచ్చేవారిని అడ్డుకుంటాం.. అడ్డొచ్చేవారిని పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్
Advertisement

US Naval Blockade Iran Ports: హ‌ర్ముజ్ జ‌ల‌సంధిని అమెరికా దిగ్బంధం చేయ‌డంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. హర్మూజ్ జలసంధిలోని అన్ని ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం (Naval Blockade) విధిస్తున్నట్లు ప్రకటించారు.”సముద్ర మార్గాల్లో అక్రమంగా టోల్ వసూలు చేసే ఎవరికీ రక్షణ ఉండదు.” అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల నుండి ఈ దిగ్బంధం అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే ఇరాన్ నౌకాదళానికి చెందిన 158 ప్రధాన నౌకలను నాశనం చేశామని, వారి వద్ద ఉన్న చిన్నపాటి ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ తమ దిగ్బంధం దరిదాపుల్లోకి వస్తే క్షణాల్లో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ అత్యంత తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ దిగ్బంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇరాన్ ఓడరేవులను ఉపయోగించే ఏ దేశ నౌకకైనా ఇది వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించే నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోవడమే కాకుండా, స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ప్రతిస్పందిస్తూ, జలసంధి ఇప్పటికీ తమ నియంత్రణలోనే ఉందని, అమెరికా ఏదైనా పొరపాటు చేస్తే అది వారికి ‘మరణ సుడిగుండం’గా మారుతుందని హెచ్చరించారు.

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో దాదాపు 20 గంటల పాటు జరిగిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించడమే ప్రధాన అడ్డంకిగా మారింది. అణ్వాయుధాలతో పాటు హర్మూజ్ జలసంధిపై నియంత్రణ, హెజ్బొల్లా, హౌతీ రెబల్స్‌కు ఇరాన్ ఇస్తున్న మద్దతు వంటి అంశాలపై కూడా ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

Advertisement

ఈ దిగ్బంధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై అప్పుడే మొదలైంది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటి పరుగులు పెడుతున్నాయి. ఫిబ్రవరి నుండి హర్మూజ్ జలసంధిలో సరుకు రవాణా ఇప్పటికే మందగించగా, తాజా నిర్ణయంతో గ్లోబల్ సప్లై చైన్ మరింత కుప్పకూలే ప్రమాదం ఉంది.

ఒకవైపు ట్రంప్ తన నిర్ణయంపై ధీమాగా ఉన్నప్పటికీ, అమెరికాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సర్వే ప్రకారం 59 శాతం మంది అమెరికన్లు ఈ వివాదం సవ్యంగా సాగడం లేదని భావిస్తున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై సెటైర్లు వేశారు.

Read Also: హర్మూజ్ దిగ్బంధం జరిగితే పెట్రోల్ ధరలు ఊహకు అందవు.. ఇరాన్ ‘మాథ్స్’ హెచ్చరిక

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×