E-Paper
Advertisement

Chamala Kiran Kumar Reddy: ఫిరాయింపుల చరిత్ర మీ నాయన సృష్టించిందే.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

Chamala Kiran Kumar Reddy: ఫిరాయింపుల చరిత్ర మీ నాయన సృష్టించిందే..  కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్
Advertisement

Chamala Kiran Kumar Reddy:  ఫిరాయింపుల చరిత్ర కేసీఆర్ కు ఉన్నదని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి తెలిపారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ…కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏకపాత్రాభినయం చేయాలని పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూశారన్నారు. పార్టీ ఫిరాయింపులు ఏ స్థాయిలో చేయవచ్చో కేసీఆర్ నిరూపించారన్నారు. అవసరం అయితే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎట్లా ఇవ్వవచ్చో కేసీఆర్ రుజువు చేశారన్నారు. ప్రస్తుతం స్పీకర్ దళితుడు కాబట్టే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు.

Also Read:Khushboo: నా మొహం చూసి నేనే భయపడ్డా.. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి 4 ఏళ్లు పట్టింది: ఖుష్బూ

కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు

Advertisement

స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ ఎస్ తప్పుపట్టడం సరికాదన్నారు. సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి,హస్తం గుర్తుపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర బీఆర్ ఎస్ కు ఉన్నదన్నారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదన్నారు. రాహుల్ గాంధీని తిట్టాలన్న అజెండాతో కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ స్వంత చెల్లి కర్మ రిటన్స్ అని ట్వీట్ చేశారని, ఆ స్థాయిలో బీఆర్ ఎస్ అందరినీ ఇబ్బంది పెట్టిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇంటర్నల్ ఒప్పందం తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పారు.

పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేపట్టలేదు?

మరోవైపు ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడటం లేదన్నారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేపట్టలేదు? అంటూ ప్రశ్నించారు. ఎల్.పి.జి.సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 18 వ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోడీ అజెండాగా మారిందన్నారు. ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారని ఎంపీ మండిపడ్డారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం పరిస్థితులు,ప్రభావం పై నరేంద్రమోదీ పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Advertisement

Also Read:Kilauea Volcano: వేయి అడుగుల ఎత్తుకు ఎగిసిన లావా.. నిప్పులు చిమ్మిన అగ్నిపర్వతం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×