// // Monalisa Bhosle: మోనాలిసా వయసు కేవలం 16 మాత్రమే.. పోక్సో చట్టం ప్రకారం విచారణ.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Monalisa Bhosle: మోనాలిసా వయసు కేవలం 16 మాత్రమే.. పోక్సో చట్టం ప్రకారం విచారణ..ఆమె తల్లి బయట పెట్టిన షాకింగ్ నిజాలు

Monalisa Bhosle: మోనాలిసా వయసు కేవలం 16 మాత్రమే.. పోక్సో చట్టం ప్రకారం విచారణ..ఆమె తల్లి బయట పెట్టిన షాకింగ్ నిజాలు
Advertisement

Monalisa Bhosle: మహాకుంభ్ మేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న విషయం బయటకు రావడంతో ఈ ఘటనపై పెద్ద వివాదం మొదలైంది. ముఖ్యంగా మోనాలిసా వయస్సుపై వచ్చిన సమాచారం ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

16 ఏళ్లకే పెళ్లి..

మోనాలిసా తల్లి చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆమె కుమార్తె వయస్సు ఇంకా 18 సంవత్సరాలు పూర్తికాలేదని తెలుస్తోంది. ఆమె మాటల్లో చెప్పాలంటే..మోనాలిసాకు కేవలం 16 సంవత్సరాలే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కొన్ని సంస్థల నాయకులతో మాట్లాడిన సమయంలో ఆమె వెల్లడించిందని సమాచారం. ఆమె తల్లి ప్రకారం..ఈ పెళ్లికి తాను అనుమతి ఇవ్వలేదని కూడా చెప్పింది.

పోక్సో చట్టం ప్రకారం విచారణ..

Advertisement

ఈ అంశంపై విశ్వహిందూ పరిషత్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. మోనాలిసా మైనర్ అయితే ఈ వివాహం చట్టపరంగా సరైనది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బాల్య వివాహ నిషేధ చట్టం.. పోక్సో చట్టం ప్రకారం విచారణ జరపాలని వారు కోరుతున్నారు. పెళ్లి నిర్వహించినవారిపై, అలాగే కార్యక్రమానికి హాజరైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మోనాలిసా తల్లి భావోద్వేగంగా మాట్లాడింది. తన కుమార్తెను బలవంతంగా తమ నుండి దూరం చేశారని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం మోనాలిసా వద్దే పుట్టిన తేదీకి సంబంధించిన పత్రాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పింది. తన కూతురిని తిరిగి తీసుకురావడానికి సహాయం చేయాలని ఆమె అధికారులను కోరింది.

Advertisement

ఈ వివాహం కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక ఆలయంలో జరిగినట్లు సమాచారం. ఆ వేడుకకు కొంతమంది రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ సంఘటన మరింత చర్చకు కారణమైంది.

ఇంకా మరోవైపు మోనాలిసా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. కుటుంబ సభ్యులు తమ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారని, అయినప్పటికీ తాను తన ఇష్టానుసారం ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మరియు సంబంధిత అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వివాహంపై నిజమైన పరిస్థితి ఏమిటన్నది విచారణ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ALSO READ: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో వద్దు అని ఇంట్లో వాళ్ళు పెద్ద రచ్చ వేసుకున్నారు.. రష్మిక కీలక వ్యాఖ్యలు..!

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

Advertisement
×