E-Paper
Advertisement

Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!
Advertisement

Anil Kumar Yadav: కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన కేటాయింపులపై రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు వేదికగా గళమెత్తారు. దేశంలోనే అతి పిన్న వయస్సు గల రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి ఇంధన రంగం ఎంతో కీలకమని, అయితే నిన్నటి బడ్జెట్‌లో రాష్ట్రం పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ పనులు, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఔటర్ రింగ్ రోడ్ నిధుల విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఐఎం (IIM) కేటాయింపుపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం పదేపదే విన్నవించినా కేంద్రం ఎందుకు చిన్నచూపు చూస్తోందని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు తాడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయించే విషయంలో చట్టపరమైన నిబంధనలు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఆయన నిలదీశారు. రాష్ట్ర వనరులపై కేంద్రం ఆంక్షలు విధించడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని, తక్షణమే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Read Also: Muduchintalapalli: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×