E-Paper
Advertisement

New IT Act Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం.. వచ్చే మార్పులివే

New IT Act Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం.. వచ్చే మార్పులివే
Advertisement

New IT Act Rules: కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆరు దశాబ్దాల నాటి పన్ను చట్టాన్ని భర్తీ చేస్తూ కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ట్యాక్స్ పేయర్స్ కొత్త చట్టాన్ని అర్థం చేసుకునేందుకు, తగినంత సమయం, సరళీకృత ఆదాయపు పన్ను నియమాలు, ఫారమ్‌లను త్వరలో ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్యాక్స్ నిబంధనలు అర్థం చేసుకునేలా ఫామ్‌లను రూపొందిస్తామని అని సీతారామన్ అన్నారు.

కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రకటించడంతో పాటు, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడానికి డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు గడువును కూడా పొడిగించారు. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను స్లాబులలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2025 కేంద్ర బడ్జెట్ సమయంలో పన్ను స్లాబులలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

పన్నులు స్లాబులు ఇలా

Advertisement

రూ.0-రూ.4 లక్షల వరకు – పన్ను లేదు
రూ.4-రూ.8 లక్షల వరకు – 5 శాతం
రూ.8-రూ.12 లక్షల వరకు – 10 శాతం
రూ.12-రూ.16 లక్షల వరకు – 15 శాతం
రూ.16- రూ.20 లక్షల వరకు – 20 శాతం
రూ.20- రూ.24 లక్షల వరకు – 25 శాతం
రూ.24 లక్షల రూపాయలకు పైన – 30 శాతం

కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025

ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం.. డైరెక్ట్ ట్యాక్స్ లను సులభతరం చేస్తున్నారు. కొత్త చట్టంలో పన్ను విభాగాల సంఖ్య 819 నుంచి 536కి తగ్గించారు. మొత్తం అధ్యాయాల సంఖ్య 47 నుంచి 23కి తగ్గనున్నాయి. అలాగే 16 షెడ్యూల్‌లు చేర్చారు.

కొత్త ఐటీ చట్టం నాలుగు ప్రధాన లక్ష్యాలు

Advertisement

1. సరళీకరణ: కొత్త ఐటీ చట్టంలో వాడుకలో లేని భాష, అనవసరమైన నిబంధనలను స్పష్టమైన ఆధునిక పదాలతో భర్తీ చేశారు.

2. డిజిటల్ వివరణ: అవినీతి, హ్యూమన్ ఇంటర్‌ఫేస్‌ను తగ్గించడానికి డిజిటల్ విధానాలు అనుమతిస్తున్నారు.

3. పన్ను చెల్లింపులు : పన్నుల చెల్లింపులలో పారదర్శకతను పెంచడానికి, అందరూ ట్యాక్స్ ఫైలింగ్ చేసే సౌలభ్యాన్ని మెరుగుపెరచనున్నారు.

4. గ్లోబల్ అలైన్‌మెంట్: డిజిటల్ ఆస్తులపై పన్ను విధించడం, ఇతర దేశాల్లో ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.

కొత్త ఐటీ చట్టం వల్ల ప్రయోజనాలు

కొత్త ఐటీ చట్టంలో ‘అంచనా సంవత్సరం’, ‘మునుపటి సంవత్సరం’ అనే పదాలను తొలగించారు. ‘ ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ఉపయోగించనున్నారు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై 12 నెలలు అంటుంది. గతంలో వివిధ విభాగాలలో విస్తరించి ఉన్న పన్ను మినహాయింపు (TDS) నిబంధనలు ఇప్పుడు క్రమబద్ధీకరించనున్నారు. వీటన్నింటినీ ఒకే విభాగం – సెక్షన్ 393 కింద వర్గీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసినప్పటికీ, ఎటువంటి జరిమానా లేకుండా, పన్ను చెల్లింపుదారులు TDS వాపసును క్లెయిమ్ చేసుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

Also Read:  అనవసర ఖర్చులు తగ్గించుకునే 5 పొదుపు చిట్కాలు

కొత్త ఐటీ చట్టం డిజిటల్ ఫస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ వర్చువల్ డిజిటల్ స్పేస్‌ను కంప్యూటర్ టెక్నాలజీ డెవలప్ చేస్తారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 పన్ను వివాదాలను పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×