E-Paper
Advertisement

Balmoor Venkat: అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్

Balmoor Venkat: అంగట్లో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది.. నువ్వు మాట్లాడుతున్నవా కేటీఆర్, బల్మూరి వెంకట్ ఫైర్
Advertisement

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడటం అంటే.. చంపిన వ్యక్తే మళ్ళీ వచ్చి సంతాపం తెలిపినట్లు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కనీసం కలవడానికి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని కేటీఆర్, ఇప్పుడు వారి కోసం పోరాడుతున్నట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఆయన విమర్శించారు.

పేపర్ లీకేజీల సర్కార్ మీది కాదా?

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. పదో తరగతి పరీక్షల నుంచి గ్రూప్-1 వరకు ప్రతి నోటిఫికేషన్‌లోనూ పేపర్ లీకేజీలు జరిగాయని, ఉద్యోగాలను అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నారని మండిపడ్డారు. లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదేపదే అబద్ధాలు చెబుతున్న కేటీఆర్, అసలు ఏ నిరుద్యోగికి న్యాయం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు మీ చేసిన మోసాన్ని గమనించే, నిరుద్యోగులు మిమ్మల్ని ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలు

Advertisement

ప్రస్తుత ప్రజా ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు నిజమైన న్యాయం జరుగుతోందని బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందజేశామని వివరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. ఇందుకోసం TGPSC ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు వెలువడతాయని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ భారీ నియామక ప్రక్రియను జీర్ణించుకోలేకనే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను, అబద్ధపు ప్రచారాలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

ALSO READ: Harish Rao: హార్వర్డ్‌లో సీఎం కాస్ట్లీ చదువు.. గురుకుల విద్యార్థులకు పాము కాట్లు, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×