E-Paper
Advertisement

BRS MLA car accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు.. ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..

BRS MLA car accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు.. ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..
Advertisement
BRS MLA car accident news

BRS MLA car accident news(Telangana news updates):

ఆయనో ఎమ్మెల్యే. అతని సతీమణి జెడ్పీ ఫ్లోర్ లీడర్. ఈమధ్యే కొత్త ఫార్చునర్ కారు కొన్నారు. ఇంకేం బండి జోరు మీదుంది. ఎమ్మెల్యే భార్య కారులో ఉన్నారు. డ్రైవర్ యమా స్పీడ్‌గా నడిపించాడు. కారు అదుపు తప్పింది. స్కూల్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సులో పిల్లలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారు నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఎమ్మెల్యే భార్య సేఫ్. మహబూబాబాద్ జిల్లా నర్సంపేట శివారు కమలాపురం క్రాస్‌రోడ్‌లో జరిగిందీ ప్రమాదం.

ఘటన జరిగిన సమయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారులో లేరు. ఆయన సతీమణి స్వప్న మాత్రమే కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 మంది పిల్లలు ఉన్నారు. ఘటనలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 15 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.

Advertisement

కారులో ఉన్న ఎమ్మెల్యే భార్య స్వప్నకు మాత్రం గట్టి దెబ్బలే తగిలాయి. ఆమె స్పృత తప్పి పడిపోయారు. కారులో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు. పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని స్వప్నను చికిత్స కోసం హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన చిన్నారులను నర్సంపేట, వరంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన విజువల్స్ సమీపంలోని సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×