E-Paper
Advertisement

Miyapur : మియాపూర్‌లో మరో ప్రేమోన్మాది.. యువతి, తల్లిపై కత్తితో అటాక్..

Miyapur : మియాపూర్‌లో మరో ప్రేమోన్మాది.. యువతి, తల్లిపై కత్తితో అటాక్..
Advertisement

Miyapur : మియాపూర్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించిన యువతి కాదనడంతో కత్తితో దాడి చేశారు. అడ్డు వచ్చిన యువతి తల్లిపైన కూడా అటాక్ చేశారు. అనంతరం తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణం మియాపూర్‌లోని ఆదిత్యనగర్‌లో చోటుచేసుకుంది.

సందీప్ అలియాస్ బబ్లూ, బాధితురాలు వైభవి గతంలో ప్రేమించుకున్నారు. అయితే రెండేళ్ల నుంచి వైభవి బబ్లూను దూరం పెడుతోంది. ఇష్టం లేదని చెప్పినా పదే పదే వెంటపడి ఆమెను విసిగించడం ప్రారంభించాడు.

Advertisement

డిసెంబర్ 13న సందీప్ హైదరాబాద్ వచ్చాడు. నేరుగా మియాపూర్‌లోని వైభవి ఇంటికి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై అటాక్ చేశాడు. అక్కడే ఉన్న వైభవి తల్లి శోభ ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. బబ్లూ యువతి తల్లి శోభపైన కూడా అదే కత్తితో దాడి చేశాడు.

దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. చికిత్స కోసం యువతిని, ఆమె తల్లిని కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సందీప్.. ఆ తరువాత తనను తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. విషమపరిస్థితిలో ఉన్న అతన్ని కూడా చికిత్స కోసం గాంధీకి తరలించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×