E-Paper
Advertisement

Cloves Benefits : వంద బ్యాక్టీరియాలను నయం చేసే లవంగాలు

Cloves Benefits : వంద బ్యాక్టీరియాలను నయం చేసే లవంగాలు
Advertisement

Cloves Benefits: మనం వంటల్లో ఎక్కువగా లవంగం ఉపయోగిస్తూ ఉంటాం. ఇది వంటకాలకు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో కూడా కొన్నేళ్లుగా లవంగాలను వినియోగిస్తున్నారు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ లవంగాలను ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కడుపులో ఏర్పడే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందడంతో పాటు దంతాల నొప్పి, గొంతు నొప్పి సమస్యలను కూడా నివారిస్తుంది. ఇందులో ఉండే యూజనల్ అనే మూలకం అధిక ఒత్తిడి, కడుపులో ఏర్పడే మంట, అజీర్తి వంటి వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. సాధారణంగా లవంగాన్ని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రెండు లవంగాలను కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో రెండు లవంగాలను తీసుకోవడం వల్ల మలబద్దకం నుంచి బయటపడవచ్చు. విరోచనాలు వంటి సమస్యతో బాధపడే వారికి ఇది అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణక్రియ మెరుగయ్యేలా చూస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు దంతాల నొప్పి సమస్యతో పాటు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. చేతులు, కాళ్లు వణకడం చాలామందిలో ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు నిద్రపోయే ముందు లవంగాలను పాలతో కలిపి తీసుకోవడం వల్ల విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా జలుబు, దగ్గు లాంటి సమస్యలకు లవంగం ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×