E-Paper
Advertisement

కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!

కారుతో మైనర్ బీభత్సం.. 7 బైకులు ధ్వంసం, ఇద్దరికి తీవ్ర గాయాలు!
Advertisement

Borabanda Accident: స్వేచ్ఛ బ్యూరో: బోరబండ కార్మికనగర్ లో ఓ మైనర్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఇద్దరు అన్నదమ్ములతోపాటు పార్క్ చేసి ఉన్న 7ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. ప్రమాదంలో అన్నదమ్ములకు గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నదమ్ములపైకి దూసికెళ్లిన కారు..

Advertisement

కార్మికనగర్ వాస్తవ్యులైన రాజ్ కుమార్ (60), ప్రభాకర్ (55) అన్నదమ్ములు. ఆదివారం ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చారు. ఇంటి ముందు వాహనాన్ని పార్క్ చేస్తుండగా విపరీతమైన వేగంతో పూర్తిగా కుడివైపు దూసుకొచ్చిన కారు ఇద్దరిని ఢీకొట్టింది. ఆ తర్వాత వారి పైనుంచి దూసుకెళ్లి పార్క్ చేసి ఉన్న మరో 7ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ప్రమాద శబ్దం విని ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన స్థానికులు కారు కింద చిక్కుకు పోయిన రాజ్ కుమార్, ప్రభాకర్ లను బయటకు తీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రభాకర్ పరిస్థితి ఆందోళనాకరంగా ఉన్నట్టు తెలిసింది.

Also Read: జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!

Advertisement

జారుకునే యత్నం..

ఓ వైపు స్థానికులు కారు కింద చిక్కుకు పోయిన రాజ్ కుమార్, ప్రభాకర్ లను బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదానికి కారకుడైన అలీ అహమద్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకు దిగి తనకేమీ తెలియదన్నట్టుగా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లాడు. గమనించిన స్థానికులు కొందరు పరుగున వెళ్లి అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×