E-Paper
Advertisement

Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్

Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్
Advertisement

Gaddam Vivek: స్వేఛ్చ బ్యూరో: కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కెసిఆర్ కుటుంబం అందినంత దోచుకుందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్(Minisrter Vivek) పేర్కొన్నారు. గజ్వేల్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాల్గొని ప్రసంగించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులను బినామీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పారన్నారు. అసెంబ్లీకి, జనం మధ్యకు రాని కెసిఆర్ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కెసిఆర్(KCR) హరీష్ రావు(Harish Rao) తప్పుడు నిర్ణయాల వల్లే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగినట్లు పేర్కొన్నారు. త్వరలో ముంపు గ్రామాల ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కలిపించి వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

Also Read: Municipal Elections: పుర పోరులో రూ. 2.02 కోట్ల నగదు స్వాధీనం.. మరో రూ. 84.89 లక్షల మద్యం పట్టివేత!

చారిత్రక పథకాలను ప్రవేశపెట్టిన సీఎం రేవంత్..

Advertisement

పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు మంత్రి వివేక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. గజ్వేల్ కు నిధులు ఇవ్వడం లేదని బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని ఇటీవల పట్టణ అభివృద్ధి కోసం రూ 18 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళల కోసం రూ 50 వేల కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, పేదల ఇడ్ల నిర్మాణం, సన్న బియ్యం, రేషన్ కార్డ్ లు ప్రతి ఒక్క అర్హులకు అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. డిసిసి అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Chanakya Niti: అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే.. గుణం ఏంటో తెలుసా ?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×