E-Paper
Advertisement

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ
Advertisement

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో, శాస్త్రీయ విధానంలో చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్తో సమావేశమై, బ్యారేజీల భద్రత, మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించారు.

బ్యారేజీల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. “గత ప్రభుత్వ లోపాల వల్ల దెబ్బతిన్న బ్యారేజీలను బాగు చేయడమే మా లక్ష్యం. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలోనే క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పర్యటిస్తారు” అని ఆయన వెల్లడించారు. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్ కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్తలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, త్వరలోనే స్వయంగా బ్యారేజీలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాలు పునరావృతం కాకుండా, 50 నుంచి 100 ఏళ్ల పాటు ఈ నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.బ్యారేజీల పునరుద్ధరణకు ముందు వాటి పునాదులు, కట్ ఆఫ్ వాల్ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం దశలవారీగా శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందుకోసం CWPRS సంస్థతో పాటు ఐఐటీ ముంబై నిపుణుల సహకారాన్ని తీసుకుంటోంది.

భూమి లోపల ఉన్న నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ రాడార్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. భూసార పరీక్షలు, బోర్‌ హోల్స్, డ్రోన్ సర్వేల ద్వారా బ్యారేజీల సామర్థ్యాన్ని లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ రానున్న 3-4 నెలల్లో (వర్షాకాలం లోపు) పూర్తి చేసి, నివేదికల ఆధారంగా కొత్త డిజైన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

వివిధ సాంకేతిక సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం ఒక సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఇరిగేషన్ అధికారులు, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ప్రతినిధులు, డిజైనింగ్ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ డేటా సేకరణ, పరీక్షల పర్యవేక్షణను బాధ్యతగా తీసుకుంటుంది. నిపుణుల విశ్లేషణల తర్వాత రూపొందించే కొత్త డిజైన్లను ఎన్ డీఎస్ ఏ  ఆమోదానికి పంపిస్తారు. వారి మార్గదర్శకాలకు అనుగుణంగానే వర్షాకాలం తర్వాత శాశ్వత పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయి.

Read Also: భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×