E-Paper
Advertisement

అమెరికా చెప్పేదంతా ఉత్త మాటలే.. ఇరాన్ ఏఐ వీడియోలతో వెస్ట్రన్ దేశాల్లో మొదలైన చర్చ!

అమెరికా చెప్పేదంతా ఉత్త మాటలే.. ఇరాన్ ఏఐ వీడియోలతో వెస్ట్రన్ దేశాల్లో మొదలైన చర్చ!
Advertisement

Digital Warfare: అమెరికా ఈ అగ్రరాజ్యం సైనిక శక్తి గురించి అందరికి తెలిసిందే. తాము అనుకుంటే చాలు ఏ దేశాన్నైనా నయానో, భయానో తమ దారికి తెచ్చుకుంటుంది అమెరికా. అలాంటి అమెరికాకు ప్రస్తుతం కొరకరాని కొయ్యగా మారింది. యుద్ధంలో మేమే గెలిచాం.. మేం అనుకున్న లక్ష్యాలను సాధించామని అమెరికా చెబుతున్నా.. ప్రపంచం మొత్తం ఈ మాటలను పూర్తిగా నిజమని నమ్మే పరిస్థితి లేదు. దీనికి ఓ కారణం ఉంది. అదే ఇరాన్‌ ఎప్పటికప్పుడు ప్రపంచానికి ఇస్తున్న అప్‌డేట్స్.

గతంలో గల్ఫ్‌ దేశాలపై..

వార్‌ ఫేర్‌లో అమెరికాను మించిన సైనిక శక్తి ప్రపంచంలో లేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్న పూర్తిగా నిజం. కానీ తాము చేసే యుద్ధాలను, దాడులను సమర్థించుకోవడంలో అమెరికా ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. గతంలో గల్ఫ్‌ దేశాలపై అమెరికా చేసిన దాడులను ప్రపంచం మొత్తం సమర్థించింది. కారణం.. అమెరికా ఆ యుద్ధాలు చేయడానికి చూపిన కారణాలు. దానికి సంబంధించిన ఆధారాలు ప్రపంచానికి చూపించలేదనేది వేరే విషయం. కానీ వెస్ట్రన్ మీడియాలో దీనికి సంబంధించిన ఆర్టికల్స్, వీడియోలు వచ్చేవి. వాటినే ప్రపంచం మొత్తం చూసేది. వాటినే తిరిగి రాసేది. ఏది ఏమైనా తాము చేసింది సరైనది అని ప్రపంచానికి బలంగా చూపించేది. దీనికి సంబంధించిన హాలీవుడ్ మూవీస్‌ను తీసి.. హీరోలుగా చూపించేది.

సోషల్ మీడియా తమ అస్త్రం..

Advertisement

కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ వార్‌లో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా చేసే ప్రకటనలు.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్‌మెంట్‌లకు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తోంది ఇరాన్. గతంలోలాగా వన్‌సైడ్ స్టోరీ కాదు.. మా ఆవేదన కూడా వినాలి.. మా వర్షన్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి అంటోంది ఇరాన్. ఇందుకోసం సోషల్ మీడియాను తమ అస్త్రంగా మార్చుకుంది. నిజానికి ఇరాన్‌ వెర్షన్‌ను రిపోర్ట్ చేసే మీడియా ప్రస్తుతం లేదు. వారు వారి దేశంలో ప్రసారం చేసుకునే కథనాలు ఎవరూ తిరిగి పబ్లీష్ చేయరు. సో.. సోషల్ మీడియానే తన అస్త్రంగా మార్చుకుంది.

Also Read: మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

దీనిని స్లోపాగండా..

Advertisement

ఇరాన్‌ను అంతం చేస్తామంటారు ఒకరోజు.. ఆల్రెడీ అంతం చేసేశాం అంటారు మరోరోజు.. ఇరాన్ తలరాతను మార్చేది మేమే అంటారు ఇంకో రోజు.. యుద్ధం కొనసాగుతోందని.. కాదు ముగిసిందని.. ఇరాన్ మేము పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని.. ఇలా అనేక స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంది ఇరాన్. దీని కోసం మీమ్స్, AI వీడియోలను ఆయుధంగా మార్చుకుంది. దీనిని స్లోపాగండా.. లేదా మెమెటిక్ వార్‌ఫేర్ అని పిలవొచ్చు. ప్రస్తుతం ఈ లెగో స్టైల్ వీడియోలు ఓ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. తాము చెప్పాలనుకున్న విషయాలను సాంగ్స్ రూపంలోనో.. డైలాగ్స్ రూపంలోనో చెప్పేస్తుంది ఇరాన్. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును టార్గెట్‌గా చేసుకుంటుంది ఇరాన్. ట్రంప్ ఏదో టైమ్‌పాస్‌ కోసం యుద్ధం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారంటూ ఒక వీడియో..

ఇరాన్‌ తన వ్యూహాన్ని..

ఓవరాల్‌గా చూస్తే ఇరాన్‌ తన వ్యూహాన్ని మార్చినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ఓ వైపు ట్రేడిషనల్‌ వార్‌ ఫేర్‌ కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో కూడా తమ శత్రుదేశాల మోరల్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. అయితే ఈ వీడియోలలో ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు కొన్ని.. అమెరికన్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు కొన్ని ఇమేజేస్, వీడియోలు కనిపిస్తున్నాయి. కానీ వీటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం వెస్ట్రన్‌ కంట్రీస్‌లోని జనాలకు మాత్రం రీచ్ అవుతున్నాయి. అమెరికా చెప్పింది మాత్రమే కాదు.. ఈ వెర్షన్ కూడా నిజమే కదా అని ఆలోచించే పరిస్థితి అయితే తీసుకువచ్చింది ఇరాన్.

పోస్ట్‌లు మరింత వైరల్‌..

అంతేకాదు అమెరికా రాజకీయాల్లోని అంతర్గత విభేదాలను ఇరాన్ తనకు అనుకూలంగా వాడుకుంటోంది అనేది వాస్తవం. అమెరికాలో యుద్ధ వ్యతిరేక గ్రూపులను, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోస్ట్‌లు పెడుతున్నారు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, బ్లూ స్కై వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేల సంఖ్యలో బాట్ అకౌంట్స్‌ను ఉపయోగించి హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తోంది ఇరాన్. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఇరాన్‌ అఫిషియల్ అకౌంట్స్ అంటే ఇరాన్‌ ఎంబసీలు చేసే కొన్ని పోస్ట్‌లు మరింత వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.

Storey By: Anup Big Tv 

Also Read: ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మోజ్ జలసంధి ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×