E-Paper
Advertisement

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

Jupally Krishna Rao: సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు
Advertisement

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో :  నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రెండ‌వ భ‌ద్రాద్రిగా పేరుగాంచిన‌ సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంత్రి జూపల్లి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: IRCTC Air Tour Package: మైసూరు To కోయంబత్తూరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఎయిర్ టూర్ ట్రై చేయండి!

ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక

Advertisement

అనంతరం ఈ నెల 26 నుంచి జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను (పోస్టర్) ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న వివిధ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మంత్రి భూమిపూజ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తున్నామని, సిర్సనగండ్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి కొల్లాపూర్ పట్టణంలో రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలకు హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో… అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Also Read: Green grapes vs Black grapes: ఆకుపచ్చ ద్రాక్ష Vs నల్లటి ద్రాక్ష.. ఏవి ఆరోగ్యానికి బెస్ట్ ?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×