E-Paper
Advertisement

Preethi case: పోలీసులకు సవాల్‌గా మెడికో ప్రీతి కేసు.. టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు

Preethi case: పోలీసులకు సవాల్‌గా మెడికో ప్రీతి కేసు.. టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు
Advertisement

Preethi case: సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసుకు సంబంధించి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి చేరింది. అందులో ప్రతి బాడీలో ఎటువంటి విషరసాయనాలు లభ్యం కాలేదని వెల్లడైంది. ఈక్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. అయితే ప్రీతి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని.. కచ్చితంగా హత్యేనని అంటున్నారు.

ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని సోమవారం ప్రీతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో డీజీపీని కలిశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు తమకు టాక్సికాలజీ రిపోర్ట్ అందలేదని.. రిపోర్టు వచ్చినా కాజ్ ఆఫ్ డెత్ క్లియర్‌గా తెలియదని ప్రీతి తండ్రి నరేందర్ అన్నారు. టాక్సికాలజీ కోసం ప్రీతికి అప్పుడే ఎక్కించిన రక్తం నుంచి నమూనాలు తీసుకున్నారని కాబట్టి సరైన రిపోర్ట్ రాదని వెల్లడించారు.

Advertisement

ఇక సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఫిబ్రవరి 26న ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9.10 గంటలకు నిమ్స్ వైద్యులు ప్రీతి కన్నుమూసినట్లు ప్రకటించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×