E-Paper
Advertisement

Manoj : శామీర్‌పేట్‌ కాల్పుల కేసు.. నటుడు మనోజ్ కు రిమాండ్..

Manoj : శామీర్‌పేట్‌ కాల్పుల కేసు.. నటుడు మనోజ్ కు రిమాండ్..
Advertisement

Manoj : మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ కాల్పుల కేసులో నటుడు మనోజ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. హెల్త్ చెకప్ తర్వాత నిందితుడిని అల్వాల్‌లో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. జడ్జి ఆదేశాలతో మనోజ్ ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద అతడిపై కేసు నమోదైంది.

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో శనివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. సిద్ధార్థదాస్‌ అనే వ్యక్తిపై మనోజ్‌ ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన సిద్ధార్థ్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై బాధితుడు శామీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

భార్య స్మితతో సిద్ధార్థదాస్‌ 2019లో విడిపోయారు. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత శామీర్‌పేట్‌లోని విల్లా నంబర్ 21లో మనోజ్‌ తో సహజీవనం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. శనివారం సిద్ధార్థదాస్ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చారు. ఈ క్రమంలో స్మితతో వాదన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మనోజ్‌ ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు.

పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్, స్మిత కలిసి అనేక మోసాలు పాల్పడ్డారని తెలుస్తోంది. ఓ సంపన్న యువతిని ట్రాప్‌ చేసి యాక్టింగ్‌ పేరుతో 50 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×