E-Paper
Advertisement

Chikoti Praveen : పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ భద్రతా సిబ్బంది.. ఎందుకంటే..?

Chikoti Praveen : పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ భద్రతా సిబ్బంది.. ఎందుకంటే..?
Advertisement

Chikoti Praveen : చికోటి ప్రవీణ్.. ఈ పేరు క్యాసినో కేసుతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారింది. ఈడీ దాడులు, విచారణ సమయంలో చికోటి హాట్ టాపిక్ గా మారారు. అతడికి వీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయని వెల్లడైంది. ఈ నేపథ్యంలో అతనితో పరిచయం కొందమందిని ఈడీ విచారించింది. క్యాసినో వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన చికోటి ప్రవీణ్ నిత్యం ఏదో విషయంలో వార్తల్లో ఉంటున్నారు.

తాజాగా లాల్‌దర్వాజ బోనాల వేళ చికోటి ప్రవీణ్ హల్ చల్ చేశారు. అమ్మవారి దర్శనానికి ప్రైవేట్ భద్రతా సిబ్బందిని కూడా వెంటబెట్టుకుని వచ్చారు. ఆలయం దగ్గర భక్తుల రద్దీ ఉన్న సమయంలో హడావిడి చేశారు. ఈ క్రమంలో ఆలయం వద్ద ఉన్న ప్రభుత్వ భద్రతా సిబ్బంది.. చికోటి ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఆ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్‌ వద్ద వెపన్స్‌ ఉన్నాయి.

Advertisement

జన సమూహంలోకి ప్రైవేట్ సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని పోలీసులు తెలిపారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వెపన్స్‌కు లైసెన్స్‌ లేకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×