E-Paper
Advertisement

కొడుకు తప్పుకు తండ్రి పదవికి రాజీనామానా? బండి సంజయ్‌కు మల్లు రవి మద్దతు!

కొడుకు తప్పుకు తండ్రి పదవికి రాజీనామానా? బండి సంజయ్‌కు మల్లు రవి మద్దతు!
Advertisement

 Mallu Ravi: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి వివాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిల్లలు తెలియక తప్పులు చేయడం సహజమని, అంతమాత్రానికే తండ్రిని కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన బండి సంజయ్‌కు మద్దతుగా నిలవడం విశేషం.

ఈ వివాదంలో బండి సంజయ్ ఒక తండ్రిగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని మల్లు రవి కొనియాడారు. తన కుమారుడు తప్పు చేశాడని తెలిసినప్పుడు ఆయన్ను దాచే ప్రయత్నం చేయకుండా, చట్టానికి లొంగిపోయేలా చేశారని గుర్తుచేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో వ్యవహరించిన సంజయ్ వైఖరిని మనం అభినందించాలే కానీ, దీన్ని రాజకీయం చేస్తూ మంత్రి పదవిని వదులుకోవాలనడం సరికాదన్నారు.

Advertisement

సాధారణంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించే రాజకీయాల్లో, ఇలాంటి ఒక సున్నితమైన అంశంపై మల్లు రవి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తప్పు ఎవరు చేసినా తప్పేనని, అయితే దానికి కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదనే సందేశాన్ని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read: కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×