E-Paper
Advertisement

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా.. కేటీఆర్!

బండి సంజయ్ నీతులు కొడుకు దగ్గర పనిచేయవా.. కేటీఆర్!
Advertisement

KTR: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటూ దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలను కోరుతున్న బీజేపీ.. తమ వారి విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పోక్సో చట్టం ఒక్కటే అయినప్పటికీ కేంద్రమంత్రుల పిల్లలకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అమలు చేయడంపై మండిపడ్డారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసును నీరుగార్చేందుకు పోలీసులు తొలుత ఇతర సెక్షన్లను పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: అల్లు అర్జున్‌నే వదలలేదు.. బండి సంజయ్ కొడుకు ఎంత: సామ రామ్మోహన్ రెడ్డి

మహిళలపై నేరాల్లో అగ్రస్థానం

Advertisement

తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆరోపించారు. తెలంగాణ మహిళలపై నేరాల రేటులో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిందని, సైబర్ నేరాలు కూడా భారీగానే పెరిగాయని విమర్శించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న తెలంగాణ సీఎం అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. సైబర్ నేరాల్లో కూడా టాప్‌లో ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వెల్‌డన్ రాహుల్ గాంధీ.. నిజంగానే తెలంగాణ రైజింగ్ అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యంగ్యంగా అభినందించారు.

Also read: దౌల్తాబాద్‌లో దారుణం.. అప్పు పేరుతో అర్దరాత్రి పండిచిన పంట చోరీ!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×