E-Paper
Advertisement

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం
Advertisement

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని అటు విద్యాశాఖ మంత్రిని, ఇటు ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×