E-Paper
Advertisement

Paytm : ఆగని పేటీఎం నష్టాలు..

Paytm : ఆగని పేటీఎం నష్టాలు..
Advertisement

Paytm : పేటీఎం ఇన్వెస్టర్లకు ఇప్పుడప్పుడే మంచిరోజులు వచ్చేలా లేవు. ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 75 శాతం పతనమై… ఆ తర్వాత కాస్త కోలుకుంటూ వస్తున్న పేటీఎం నష్టాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. థర్డ్ క్వార్టర్లో దాదాపు రూ.594 కోట్ల నష్టం వచ్చినట్లు పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ప్రకటించింది. నిరుడు ఇదే సమయంలో వచ్చిన రూ.481 కోట్ల కంటే దాదాపు 24 శాతం ఎక్కువగా ఈసారి నష్టాలు నమోదు చేసింది… పేటీఎం.

సంస్థ కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.1,086. కోట్ల నుంచి 76 శాతం పెరిగి రూ.1,914 కోట్లకు చేరింది. యూజర్లకు చెల్లింపు సేవల ద్వారా ఆదాయం 55 శాతం పెరిగి రూ.549 కోట్లకు, మర్చంట్లకు చెల్లింపు సేవల ద్వారా ఆదాయం 56 శాతం పెరిగి రూ.624 కోట్లకు చేరిందని పేటీఎం వెల్లడించింది. కంపెనీ నికర పేమెంట్‌ మార్జిన్‌ అనేక రెట్లు పెరిగి రూ.443 కోట్లకు చేరింది. ఆర్థిక సేవల వ్యాపార ఆదాయం 293 శాతం పెరిగి రూ.349 కోట్లకు చేరింది. ఇది మొత్తం ఆదాయంలో 18 శాతంగా ఉంది. 2021 సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 6 శాతంగా నమోదైంది. థర్డ్ క్వార్టర్లో 92 లక్షల రుణాలను పంపిణీ చేసినట్లు పేటీఎం తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే రుణాలు 224 శాతం పెరిగి రూ.7,313 కోట్లకు చేరాయని పేటీఎం పేర్కొంది. నెలవారీ లావాదేవీలు చేస్తున్న సరాసరి వినియోగదార్లు 39 శాతం పెరిగి 7.97 కోట్లకు చేరారని… మర్చంట్లు 2.95 కోట్లకు పెరిగారని వివరించింది.

Advertisement

మరోవైపు… వరుసగా అన్ని క్వార్టర్లలోనూ పేటీఎం నష్టాలు నమోదు చేస్తుండటంతో… ఇన్వెస్టర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. IPOలో పేటీఎం ఒక్కో షేరును రూ.2150కి కేటాయించగా… స్టాక్ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి నష్టాల్లోనే ఉంది. ఒక దశలో ఏకంగా 75 శాతం మేర పేటీఎం షేర్ వాల్యూ పతనమైంది. ఆ తర్వాత కనిష్టస్థాయిల దగ్గర కొనుగోళ్లు జరిగినా… ఇప్పటికీ ఒక్కో షేరు ధర రూ.650కి అటూఇటుగా ఉంది. దాంతో… షేరు ఎప్పుడు లాభాల్లోకి మళ్లుతుంది? ఎప్పుడు అమ్ముకునేది? అని ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×